సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఫ‌స్ట్ తెలుగు.. ఆ త‌ర్వాతే హిందీ! బాలీవుడ్ సినిమాలపై.. టాలీవుడ్ స్టార్స్ అల్టిమేటం

ABN, Publish Date - Feb 25 , 2026 | 04:46 PM

డైరెక్ట్ హిందీ సినిమాల్లో ఆఫర్స్ వచ్చినా, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ తెలుగుతో పాటు తీస్తేనే చేస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. హిందీ చిత్రాలను తెలుగులో డబ్ చేస్తామంటే వీరు అంగీకరించలేదని సన్నిహితులు చెబుతున్నారు.

Vijay Devarakonda - Allu Arjun

మన టాలీవుడ్ స్టార్స్‌లో పైకి కనిపించేంత యూనిటీ లేదని అంటూ ఉంటారు. కానీ, ఇతర వేదికలపై తామంతా ఒక్కటే అన్నట్టుగా ఉన్నారు తెలుగు టాప్ హీరోస్! ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఎంతో క్రేజ్ ఉన్న టాలీవుడ్ స్టార్స్‌తో సినిమాలు తీయడానికి బాలీవుడ్ నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే రామ్ చరణ్ (Ramcharan) తో 'జంజీర్', ప్రభాస్ (Prabhas) హీరోగా 'ఆదిపురుష్', జూనియర్ యన్టీఆర్ (Jr NTR)తో 'వార్ -2' చిత్రాలను హిందీ నిర్మాతలు తెరకెక్కించారు. ఈ చిత్రాలేవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడం గమనార్హం.

అయినా సరే ఇప్పటికీ ఈ ముగ్గురు హీరోలతో పాటు అల్లు అర్జున్ (Allu Arjun), విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) వంటి టాలీవుడ్ స్టార్స్‌తోనూ సినిమాలు తీయాలని బాలీవుడ్ బాబులు ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషంగా మారింది. అందుకోసం మన స్టార్స్‌ను మాటల్లో పెట్టి మరీ బురిడీ కొట్టించే ప్రయత్నాలు కూడా సాగాయని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. అందులో కరణ్ జోహార్ తన 'కాఫీ విత్ కరణ్' ప్రోగ్రామ్‌లో మన స్టార్స్‌ను ఇరకాటంలో పెట్టేలా ప్రశ్నలు గుప్పించిన సందర్భాలూ ఉన్నాయి. అయినా మన స్టార్స్ అందరూ ఒక్క మాటే మీదే ఉన్నారు. అదే ఇక్కడి విశేషం...


మన టాలీవుడ్ స్టార్స్‌తో డైరెక్ట్‌గా హిందీ సినిమాలు తీయాలని ఉత్తరాది వారు భావిస్తున్నారు. అయితే మన స్టార్స్ మాత్రం తెలుగులోనూ సదరు చిత్రాన్ని తీస్తేనే నటిస్తామన్న డిమాండ్ చేస్తున్నారు. ఎటూ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేటప్పుడు తెలుగులోనూ డబ్ చేస్తాం కదా అన్నది బాలీవుడ్ బాబుల మాట. 'పుష్ప-2' ఘన విజయం తరువాత టాప్ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్ అల్లు అర్జున్ తో సినిమా కోసం వెంట పడ్డాయి. బన్నీ కూడా తన మాతృభాష టచ్ లేకుంటే కుదరదు అని చెప్పేశారు. తరువాత తనకు నచ్చిన సబ్జెక్ట్స్‌తో వచ్చిన సౌత్ ఇండియాకు చెందిన 'సన్ పిక్చర్స్'కే సినిమా చేస్తున్నారు. ఈ మూవీని తెలుగు, తమిళ, ఇంగ్లిష్ భాషల్లో తెరకెక్కించి, తరువాత ఇతర భాషల్లో డబ్ చేస్తూ భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.


'లైగర్' సినిమా షూటింగ్ సమయంలో కొందరు బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ విజయ్ దేవరకొండతో సినిమా తీసేందుకు ఆసక్తి చూపించారు. విజయ్ కూడా తెలుగుతో పాటే హిందీ కూడా అన్న నిబంధన పెట్టారని తెలుస్తోంది. ఇలా ఎటు చూసినా టాలీవుడ్ స్టార్స్ అందరూ ఒకే మాట మీద ఉండడం వారి మధ్య ఉన్న ఐక్యతను చాటుతోందని పరిశీలకులు అంటున్నారు. ఒకప్పుడు నాగార్జున, చిరంజీవి, వెంకటేశ్ కూడా హిందీలో నటించినా, అవి సౌత్ తో కనెక్షన్ ఉన్న మూవీస్ కావడం గమనార్హం! అయితే వీరిలో నాగ్ మాత్రం కొన్ని డైరెక్ట్ హిందీ మూవీస్‌లో నటించారు. ఏది ఏమైనా తెలుగుతో అనుబంధం లేకుంటే నటించకూడదు అనుకున్న మన స్టార్స్‌ను అభినందించాల్సిందే. భవిష్యత్‌లో ఎవరైనా టాలీవుడ్ హీరోలు స్ట్రెయిట్ హిందీ మూవీస్‌లో నటిస్తారేమో చూడాలి.

Updated Date - Feb 25 , 2026 | 08:06 PM