సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అట్లీకి.. అల్లు అర్జున్ డెడ్‌లైన్! కారణం.. ఆ డైరెక్ట‌రేనా?

ABN, Publish Date - Jul 07 , 2026 | 10:07 AM

కోలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ డైరెక్టర్ అట్లీ, 'ఐకాన్ స్టార్' అల్లు అర్జున్ కలయికలో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రాకా’.

raaka, allu arjun

కోలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ డైరెక్టర్ అట్లీ (atlee), 'ఐకాన్ స్టార్' అల్లు అర్జున్ (allu arjun) కలయికలో రూపుదిద్దుకుంటున్న పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘రాకా’ (raaka). మొదటిసారిగా వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అనౌన్స్‌మెంట్ నుంచే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కీలకమైన షూటింగ్ షెడ్యూల్స్ శరవేగంగా జరుగుతున్నాయి. సరికొత్త కథాంశంతో, మునుపెన్నడూ చూడని రీతిలో బన్నీని వెండితెరపై ప్రెజెంట్ చేసేందుకు దర్శకుడు అట్లీ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి.

ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పదుకొణె (deepika padukone) నటిస్తుండటం విశేషం. అంతేకాకుండా, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మిక మందన్న వంటి స్టార్ హీరోయిన్లు కూడా కీలక పాత్రల్లో మెరవనున్నట్లు గట్టి ప్రచారం సాగుతోంది. ఇంతటి భారీ తారాగణంతో పాటు, సాంకేతికంగానూ విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. టాలెంటెడ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ 'సన్ పిక్చర్స్' దాదాపు రూ.800 కోట్ల భారీ వ్యయంతో ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త నెట్టింగ తెగ హల్‌చల్ చేస్తోంది. తన తదుపరి చిత్రాల విషయంలో ఎంతో పక్కాగా ఉండే అల్లు అర్జున్, 'రాకా' షూటింగ్‌ను ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి ఎలాగైనా ముగించాలని దర్శకుడు అట్లీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు టాక్. సినిమా మేకింగ్‌లో ఎలాంటి ఆలస్యం జరగకుండా, ముందుగా అనుకున్న షెడ్యూల్స్ ప్రకారమే చిత్రీకరణను పూర్తి చేయాలని బన్నీ గట్టిగా పట్టుబడుతున్నారట. దీంతో ఎక్కడా క్వాలిటీ తగ్గకుండానే, పక్కా టైమ్ మేనేజ్‌మెంట్‌తో షూటింగ్‌ను క్లోజ్ చేయాలని చిత్ర బృందం కూడా రాత్రింబగళ్లు శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇంతలా బన్నీ డెడ్‌లైన్ పెట్టడం వెనుక బలమైన కారణమే ఉంది. 'రాకా' ముగిసిన వెంటనే ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తాను చేయబోయే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం అల్లు అర్జున్ సిద్ధం కావాల్సి ఉంది. అందుకే ప్రస్తుత ప్రాజెక్ట్ మేకర్స్‌ను ఆయన అలర్ట్ చేసినట్లు సమాచారం. మొత్తం షూటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే చిత్ర బృందం అధికారికంగా విడుదల తేదీని వెల్లడించనుంది. అంతా సవ్యంగా సాగితే, వచ్చే ఏడాదిలో 'రాకా' ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Updated Date - Jul 07 , 2026 | 12:33 PM