సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సీక్రెట్‌గా పవన్ కళ్యాణ్‌ని కలిసిన అల్లు అర్జున్.. వాస్తవమిదే!

ABN, Publish Date - Jun 10 , 2026 | 08:41 PM

గత కొంతకాలంగా మెగా- అల్లు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఎన్నికల సమయం నుంచి పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో పెద్ద ఎత్తున వార్ జరుగుతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.

Pawan Kalyan

గత కొంతకాలంగా మెగా- అల్లు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఎన్నికల సమయం నుంచి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానుల మధ్య ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో పెద్ద ఎత్తున వార్ జరుగుతోంది. అంతేకాకుండా మెగా ఇంటి వేడుకల్లో బన్నీ కనిపించడమే మానేశాడు. దీంతో వీరిద్దరి మధ్యన ఇంకా విభేదాలు అలాగే కొనసాగుతున్నాయని టాక్ నడుస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక సంచలన వార్త విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను సీక్రెట్‌గా కలిశారనే ప్రచారం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి ఈ మధ్యనే సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. కొన్నిరోజులు ఇంట్లోనే రెస్ట్ తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడిప్పుడే మళ్లీ విధుల్లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఎవరికీ తెలియకుండా పవన్ ఇంటికి వెళ్ళి ఆయనను పరామర్శించినట్లుగా సోషల్ మీడియాలో కొందరు వార్తలు వైరల్ చేస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసు కోవడంతోపాటు కుటుంబ విషయాల గురించి కూడా చర్చించారనేలా జరుగుతోన్న ఈ ప్రచారంలో వాస్తవం లేదని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ అసలు కలుసుకోలేదని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని మెగా కాంపౌండ్ నుంచి వినిపిస్తోంది.

మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాపై అల్లు అర్జున్ పోస్ట్ పెట్టడం సంచలనంగా మారింది. ‘పెద్ది’ సినిమాపై జరుగుతున్న నెగిటివిటీని పక్కన పెట్టి.. చరణ్ నటనను అభినందిస్తూ బన్నీ ట్వీట్ వేయడం, దానికి చరణ్ థాంక్స్ చెప్పడం లాంటివి చూస్తుంటే.. మళ్లీ బన్నీ మెగా ఫ్యామిలీకి దగ్గర అవుతున్నాడనేలా నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఏదిఏమైనా వారందరూ ఎప్పుడూ ఒకే కుటుంబం. ఎప్పటికీ వారు కలిసే ఉంటారు అని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

భారతీరాజా అంత్యక్రియల్లో తీవ్ర కలకలం.. బంధువులపై సింగర్ ఆగ్రహం

కన్నీళ్ళు పెట్టిస్తోన్న భారతీరాజా చివరి వీడియో..

Drishyam 3: అందుకే.. వెంక‌టేశ్‌తో దృశ్యం 3 రీమేక్ చేయలేదు! అస‌లు గుట్టు.. బ‌య‌ట పెట్టిన డైరెక్ట‌ర్‌

Updated Date - Jun 11 , 2026 | 02:12 PM