సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Allu Arjun: అభిమానుల సదస్సులో.. చెప్పులు తీసి గౌరవం చాటిన బన్నీ

ABN, Publish Date - Jul 28 , 2026 | 03:33 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మరోసారి తన వినమ్రతతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) మరోసారి తన వినమ్రతతో అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. మంగళవారం జరిగిన అల్లు అర్జున్ ఫాన్స్ అసోసియేషన్(AAFA) వార్షిక సదస్సులో ఓ అభిమాని ఆయనకు  జగన్నాథుడి విగ్రహాన్ని బహూకరించారు. ఆ పవిత్ర విగ్రహాన్ని స్వీకరించే సమయంలో అల్లు అర్జున్ చూపించిన గౌరవ భావం అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది.  స్వామివారి ప్రతిమ అందుకునే ముందు ఆయన తన చెప్పులను  విప్పి, అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ జగన్నాథుడి విగ్రహాన్ని స్వీకరించారు. అనంతరం భక్తిపూర్వకంగా నమస్కరించారు. ఇది  ఆయనలోని వినమ్రతను, భారతీయ సంప్రదాయాల పట్ల ఉన్న గౌరవాన్ని ప్రతిబింబించిందని అభిమానులు ప్రశంసిస్తున్నారు.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ వ్యవహారశైలిని నెటిజన్లు ప్రశంసిస్తూ, 'స్టార్‌డమ్ ఎంత పెరిగినా సంస్కారం మర్చిపోలేదు, 'ఇదే నిజమైన వినమ్రత' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ , అట్లీ  దర్శకత్వంలో 'రాకా' మూవీ చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రంలో దీపికా పడుకొనే కథానాయిక, షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 

Updated Date - Jul 28 , 2026 | 05:44 PM