Raaka Movie: అల్లు అర్జున్ వైల్డ్ ఎంట్రీ సీన్‌పై అదిరిపోయే అప్‌డేట్.. అట్లీ మాస్టర్ ప్లాన్
ABN, Publish Date - Oct 05 , 2026 | 06:06 AM
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమాపై క్రేజీ లీక్ వైరల్ అవుతోంది.
పుష్ప సిరీస్‌తో పాన్ ఇండియా వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun). పుష్ప విధ్వంసం తర్వాత బన్నీ రేంజ్ ఏంటో ప్రపంచం మొత్తం చూసింది. మరి అలాంటి స్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎలా ఉండాలి..? ఫ్యాన్స్ ఊహలకు కూడా అందని రేంజ్‌లో ఉండాలి కదా..! సరిగ్గా అలాంటి అంచనాలతోనే కోలీవుడ్ సెన్సేషన్ అట్లీ (Atlee) రంగంలోకి దిగాడు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ‘రాకా’ (Raaka) సినిమాపై రోజుకో సంచలన వార్త బయటకు వస్తోంది. ముఖ్యంగా ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్న ఒక క్రేజీ లీక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది!
సాధారణంగానే అట్లీ సినిమాల్లో హీరోల ఇంట్రడక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటాయి. అలాంటిది అల్లు అర్జున్ లాంటి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న స్టార్ దొరికితే అట్లీ ఊరుకుంటాడా..? థియేటర్లు దద్దరిల్లేలా బన్నీ ఎంట్రీ సీన్‌ను డిజైన్ చేశారట. ఒక సాధారణ హీరో ఎంట్రీలా కాకుండా, థియేటర్లలో కూర్చున్న ప్రతి ఒక్కరి రోమాలు నిక్కబొడుచుకునే భారీ ఎలివేషన్‌తో ఈ సీన్ రాబోతోంది. ఆ మధ్య రిలీజైన వైల్డ్ లుక్ గుర్తుంది కదా..? సరిగ్గా అదే వైల్డ్ క్యారెక్టర్‌తోనే అల్లు అర్జున్‌ను కథలోకి పరిచయం చేసి, అక్కడినుంచే సినిమాకు కీలకమైన ఫ్లాష్‌బ్యాక్‌ను ఓపెన్ చేస్తారని తెలుస్తోంది.
అంటే సినిమా మొత్తానికి బన్నీ ఎంట్రీ సీనే మెయిన్ హుక్ పాయింట్‌గా నిలవబోతోంది. ఇక ఈ భారీ విజువల్ వండర్ షూటింగ్‌కు సంబంధించి మరో అదిరిపోయే అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ నెల మూడో వారం నుంచే ‘రాకా’ సరికొత్త షెడ్యూల్ షురూ కానుంది. ఇందుకోసం ఇప్పటికే భారీ సెట్స్ సిద్ధమయ్యాయి. ఈ షెడ్యూల్‌లోనే సినిమాకు కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్‌ను, అలాగే ఇంట్రడక్షన్ సీక్వెన్స్‌ను అట్లీ తెరకెక్కించనున్నట్లు సమాచారం. హాలీవుడ్ స్థాయి స్టంట్ మాస్టర్ల పర్యవేక్షణలో ఈ యాక్షన్ బ్లాక్స్ ఉండబోతున్నాయి.
ఈ ప్రాజెక్ట్‌ను మరింత క్రేజీగా మార్చే అంశం ఇందులో ఉన్న తారాగణం. బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకోణె ఇందులో మెయిన్ లీడ్‌గా కనిపిస్తుండగా, తన సహజ నటనతో మెప్పించే మృణాల్ ఠాకూర్ మరో కీలక పాత్రలో కనిపించబోతోంది. వీరికి తోడు గ్లామర్ క్వీన్ జాన్వీ కపూర్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం సినిమాపై హైప్‌ను రెట్టింపు చేసింది. ఒకే సినిమాలో ఇంతమంది స్టార్ హీరోయిన్లు కనిపించడం ఇండియన్ స్క్రీన్‌పై చాలా అరుదుగా చూస్తుంటాం. ఇక కథ విషయానికి వస్తే, అట్లీ ఈసారి ఒక భారీ మాఫియా బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకున్నాడు.
అంతర్జాతీయ స్థాయిలో నడిచే అండర్ వరల్డ్ మాఫియా డాన్ చుట్టూ ఈ కథ మొత్తం తిరుగుతుందట. అంతేకాదు, సినిమాలో ఊహించని ట్విస్టులు ఇచ్చేందుకు ప్రత్యేకంగా కొన్ని సర్ ప్రైజింగ్ గెస్ట్ రోల్స్‌ను కూడా ప్లాన్ చేశాడు. ఇండియన్ సినిమాలోని మరికొందరు అగ్ర నటులు ఈ కేమియో పాత్రల్లో మెరవబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్, ఇండియన్ టాప్ డైరెక్టర్ విజన్, పాన్ వరల్డ్ స్థాయి స్టార్ కాస్టింగ్.. వీటన్నింటికీ మించి అల్లు అర్జున్ నెవర్ బిఫోర్ మాస్ అవతార్..! ఇవన్నీ చూస్తుంటే ‘రాకా’ ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.