అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. AA 23 ఆగిపోలేదు
ABN, Publish Date - Jun 05 , 2026 | 07:18 AM
అల్లు అర్జున్-లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో రానున్న ‘ఏఏ 23’ సినిమా ఆగిపోయిందన్న వార్తలపై రచయిత రత్నకుమార్ క్లారిటీ ఇచ్చారు.
అల్లు అర్జున్ (Allu Arjun) కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ఏఏ 23 (AA23 Movie) వర్కింగ్ టైటిల్. అయితే ఈ సినిమా బడ్జెట్ కారణాల వల్ల ఆగిపోయిందంటూ సోషల్‌మీడియాలో ఇటీవలే వార్తలు వచ్చాయి. దీనిపై రచయిత రత్నకుమార్ (Rathna Kumar) పరోక్షంగా స్పందించి.. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.
కమల్ హాసన్ హీరోగా లోకేశ్ దర్శకత్వంలో వచ్చిన ‘విక్రమ్’ నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రత్నకుమార్ పోస్ట్ పెట్టారు. ‘విక్రమ్’ సినిమా ప్రారంభంలో లోకేశ్ పెట్టిన పోస్ట్‌ను షేర్ చేసిన రత్నకుమార్.. ఆ పోస్ట్ చరిత్ర సృష్టించిందని గుర్తుచేశారు. ఆయన చిత్రాల్లో తాను కూడా భాగమైనందుకు ఆనందం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్‌తో లోకేశ్ చేయనున్నారు. సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ‘ఏఏ 23’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జతచేశారు.
దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోలేదని స్పష్టత వచ్చేసింది. ఇటీవలే ఈ సినిమాను ప్రకటించి విడుదల చేసిన థీమ్ వీడియో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను పెంచేసింది. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ తెరకెక్కిస్తున్న ‘రాకా’లో నటిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌లో ఆయన పాత్ర పలు కోణాల్లో సాగనుంది. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం పూర్తయిన వెంటనే ‘ఏఏ 23’ మొదలయ్యే అవకాశం ఉంది.