సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అల్లు అర్జున్‌: టొమాట్సుకు సీతారామ కళ్యాణం పటం బహూకరణ

ABN, Publish Date - Mar 27 , 2026 | 09:18 PM

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ జపాన్‌కు చెందిన గీక్‌ పిక్చర్స్‌ సీఈఓ టొమాట్సు కోసానోకు సీతారామ కళ్యాణం చిత్రపటాన్ని బహూకరించారు

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) జపాన్‌కు చెందిన గీక్‌ పిక్చర్స్‌ సీఈఓ టొమాట్సు కోసానోకు సీతారామ కళ్యాణం చిత్రపటాన్ని బహుకరించారు. శ్రీరామ నవమి సందర్భంగా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసేలా ఈ చిత్రపటాన్ని అందించారు. మన దేశ సంస్కృతి, ఇతిహాసాలు, సంప్రదాయాల గురించి  టొమాట్సు కోసానోకు వివరించారు.  శ్రీరామ నవమి వంటి పవిత్రమైన రోజున మన సంస్కృతికి నిదర్శనమైన సీతారాముల చిత్రపటాన్ని అందించడం ద్వారా, అల్లు అర్జున్ తనలోని ఆధ్యాత్మిక కోణాన్ని, దేశీయ వారసత్వం పట్ల ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు.

ప్రస్తుతం అల్లు అర్జున్‌ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ పతాకంపై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. దీపికా పడుకోణె ఈ చిత్రంలో కథానాయిక. 

Updated Date - Mar 27 , 2026 | 09:44 PM