అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. తల్లికి బన్నీ గిఫ్ట్
ABN, Publish Date - Mar 09 , 2026 | 03:52 PM
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. తన మాతృమూర్తి నిర్మలకు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తన మాతృమూర్తి నిర్మలకు అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం బ్రాండ్ న్యూ లెక్సస్ కారును (Lexus Car) ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల తన భార్య స్నేహాకు కూడా ఓ బహుమతితో సర్ప్రైజ్ చేశారు. బన్నీ15 వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అత్యంత ఖరీదైన బెంజ్ కారును ఆమెకు గిఫ్ట్ గా ఇచ్చారు.
అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో భారీ యాక్షన్ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో దీపికా పదుకోణె కథానాయికగా నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ తదుపరి లోకేష్ కనకరాజు దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు.