సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బెంజ్ కారు.. తమ్ముడి కోసం కాదా.. ఆమెకోసమా

ABN, Publish Date - Mar 07 , 2026 | 09:38 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. తన భార్య అల్లు స్నేహరెడ్డి(Sneha Reddy)కి మర్చిపోలేని గిఫ్ట్ ని ఇచ్చారు. మార్చి 6 న అల్లు అర్జున్ - స్నేహరెడ్డి 15 వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా బన్నీ.. స్నేహను సర్ ప్రైజ్ చేశారు.

Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. తన భార్య అల్లు స్నేహరెడ్డి(Sneha Reddy)కి మర్చిపోలేని గిఫ్ట్ ని ఇచ్చారు. మార్చి 6 న అల్లు అర్జున్ - స్నేహరెడ్డి 15 వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా బన్నీ.. స్నేహను సర్ ప్రైజ్ చేశారు. అత్యంత ఖరీదైన బెంజ్ కారును ఆమెకు గిఫ్ట్ ఇచ్చారు. అల్లు కుటుంబం ముందు స్నేహను తీసుకొచ్చి ఆమెకు కారు కీస్ ను అందించారు బన్నీ. ఇక ఖరీదైన కారును చూసి స్నేహ.. ఆనందంతో బన్నీకి ముద్దు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

మార్చి 6 ఉదయాన్నే ఈ కారు అల్లు అర్జున్ ఇంటికి డెలివరీ అయిన వీడియో సోషల్ మీడియా వైరల్ గా మారింది. దీంతో అందరూ బన్నీ.. తన తమ్ముడు శిరీష్ కి పెళ్ళి గిఫ్ట్ గా ఇస్తున్నారని అనుకున్నారు. కానీ, ఈ కారు.. శిరీష్ కోసం కాదని, స్నేహ కోసమని క్లారిటీ వచ్చింది. ఇక భార్య కోసం ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వదిన అంటే అన్నకు ఎంత ప్రేమనో అని కామెంట్స్ చేస్తున్నారు.

అల్లు అర్జున్.. స్నేహరెడ్డిని ప్రేమించి ఇరు కుటుంబాలను ఒప్పించి 2011, మార్చి 6 న వివాహం చేసుకున్నారు. ఈ జంటకు అల్లు అయాన్, అల్లు అర్హ జన్మించారు. పెళ్ళి తరువాత బన్నీతో చాలా మార్పులు వచ్చాయి. తాను ఇప్పుడు ఇలా ఉన్నాను అంటే అది స్నేహ వలనే అని బన్నీ చెప్తూ ఉంటారు. ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం AA22 సినిమాతో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated Date - Mar 07 , 2026 | 09:55 PM