Allu Arjun: ఫోర్బ్స్ ‘షో స్టాపర్స్ 2026’లో వీడియో వదిలిన ఐకాన్ స్టార్
ABN, Publish Date - Aug 29 , 2026 | 08:19 PM
ఫోర్బ్స్ ఇండియా తాజాగా విడుదల చేసిన ‘షో స్టాపర్స్ - 2026’ ప్రత్యేక సంచిక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెరిసిన సంగతి తెలిసిందే.
ఫోర్బ్స్ ఇండియా తాజాగా విడుదల చేసిన ‘షో స్టాపర్స్ - 2026’ ప్రత్యేక సంచిక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మెరిసిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో తమదైన ముద్ర వేస్తూ ప్రభావం చూపుతున్న వంద మంది ప్రముఖులతో ఈ ప్రత్యేక సంచికను రూపొందించింది ఫోర్బ్స్ ఇండియా. పాన్ ఇండియా స్థాయిలో విశేషమైన క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్‌కు ఈ జాబితాలో ప్రత్యేక స్థానం దక్కింది. ‘పుష్ప’, ‘పుష్ప 2: ది రూల్’ చిత్రాలతో దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌ను ఏర్పరచుకున్న ఆయన.. బ్రాండ్ విలువ, ప్రజాదరణ, ప్రభావం వంటి అంశాల్లో తన సత్తాను చాటుకున్నారు. ఈ నేపథ్యంలో ‘షో స్టాపర్స్ - 2026’ కవర్ స్టార్‌గా అల్లు అర్జున్‌ను ఎంపిక చేసింది ఫోర్బ్స్ ఇండియా.
ఈ అరుదైన గుర్తింపుపై అల్లు అర్జున్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఫోర్బ్స్ ఇండియా కవర్ ఫొటోషూట్ సందర్భంగా జరిగిన ఆసక్తికరమైన విషయాలను కూడా అల్లు అర్జున్ అభిమానులతో పంచుకున్నారు. తెరవెనుక జరిగిన ఫొటోషూట్ విశేషాలకు సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.కవర్ షూట్‌లో అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాన్ ఇండియా స్టార్‌గా అల్లు అర్జున్ సాధిస్తున్న వరుస ఘనతల్లో ఫోర్బ్స్ ఇండియా ‘షో స్టాపర్స్ - 2026’ కవర్‌పై చోటు దక్కించుకోవడం మరో మైలురాయిగా నిలిచింది.