సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Allu Arjun: ప్రతి సంవత్సరం ఒక మంచి పని… అభిమానులకు ఐకాన్ స్టార్ సందేశం

ABN, Publish Date - Feb 08 , 2026 | 10:40 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమాన సంఘం హైదరాబాద్‌లో సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది.

Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమాన సంఘం (AAFA) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో రెండు తెలుగు రాష్ట్రాల కమిటీ సభ్యులతో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. దాదాపు నాలుగు నుంచి ఐదు గంటల పాటు సాగిన ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు శివశంకర్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అంజి యాదవ్ అధ్యక్షత వహించారు. రాబోయే రోజుల్లో జిల్లా, మండల, టౌన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలను ప్రారంభించారు.

సమావేశంలో ఎంపికైన ప్రతినిధులకు వారి బాధ్యతలు, పాత్రలను స్పష్టంగా వివరించారు. ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యకలాపాలను క్రమబద్ధంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు స్టేట్, డిస్ట్రిక్ట్, టౌన్ స్థాయి కమిటీల ఏర్పాటుపై విస్తృతంగా చర్చించారు. భవిష్యత్తులో అసోసియేషన్ కార్యక్రమాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడంలో ఈ కమిటీలు కీలకంగా ఉంటాయని నాయకులు తెలిపారు.

ఇకపై అభిమాన సంఘం ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టడంతో పాటు అభిమానుల మధ్య ఐక్యతను పెంపొందించే కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ముఖ్యంగా “ప్రతి సంవత్సరం ఒక మంచి పని” అనే నినాదాన్ని అభిమానులు అనుసరించాలని అల్లు అర్జున్ సూచించినట్లు వెల్లడించారు. ఆయన ప్రతిభ, క్రమశిక్షణ, విలువలకు అనుగుణంగా ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యకలాపాలు కొనసాగాలని నేతలు పేర్కొన్నారు.

Updated Date - Feb 08 , 2026 | 10:41 PM