సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Allu Arjun: అల్లు అర్జున్‌ ముంబైకి షిప్ట్‌ అవ్వనున్నారా...

ABN, Publish Date - Apr 21 , 2026 | 09:53 AM

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం ‘రాకా’ సినిమాతో బిజీగా ఉన్నారు. అట్లీ దర్శకత్వంలో భారీగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్‌ ఎక్కువ శాతం ముంబైలోనే జరుగుతోంది.

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) ప్రస్తుతం ‘రాకా’ (Raaka) సినిమాతో బిజీగా ఉన్నారు. అట్లీ దర్శకత్వంలో భారీగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్‌ ఎక్కువ శాతం ముంబైలోనే జరుగుతోంది. దాని కోసం బన్నీ కూడా అక్కడే ఉండాల్సి వస్తోంది. తాజాగా బన్నీ గురించి ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. ముంబైలో ఆయన ఓ ఖరీదైన ఇల్లు కొన్నారని (Allu Arjun Mumbai House), త్వరలోనే అక్కడికి షిప్ట్‌ అవుతారని ఆ వార్త సారాంశం. ఇప్పుడాయన ముంబైకి షిప్ట్‌ అవుతారేమోనని, అక్కడే స్థిరపడతారని అభిమానులు బెంగ పడుతున్నారు. ఈ విషయంపై బన్ని సన్నిహితులను ఆరా తీయగా పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఆయన ముంబైలో ఇల్లు కొన్నారనే వార్తల్లో నిజం లేదని, అయితే షూటింగ్‌ కోసం వెళ్లినప్పుడు ఉండటానికి ఓ హౌస్‌ను రెంట్‌కు తీసుకున్నారని తెలిసింది.

ప్రస్తుతం ‘రాకా’ సినిమా షూటింగ్‌ ముంబైలో జరుగుతోంది. గ్యాప్‌ దొరికిన సమయంలో హైదరాబాద్‌  వస్తున్నారు. ముంబై వెళ్లిన ప్రతిసారి హోటల్‌ ఖర్చులు రోజుకి రూ.2 లక్షలు కావడంతో బిల్లు తడిసి మోపెడు అవుతుందని, నిర్మాతలపై అంత భారం పెట్టడం ఇష్టం లేక ఆయన ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నారట. ‘రాకా’ షూటింగ్‌ ముగిశాక ఆ ఇల్లు ఖాళీ చేస్తారని అంటున్నారు. అంతే తప్ప ఆయన ముంబైల్లో ఇల్లు కొనలేదని సన్నిహితులు వివరణ ఇచ్చారు.

Updated Date - Apr 21 , 2026 | 12:53 PM