సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

లెక్కే వేరు.. అస‌లు తగ్గేదేలే! ముగ్గురు డైరెక్టర్లతో.. అల్లు అర్జున్‌ మాస్‌ ర్యాంపేజ్‌

ABN, Publish Date - May 22 , 2026 | 01:17 PM

బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెడుతూ ఇండస్ట్రీకి మైండ్ బ్లాకింగ్ షాక్స్ ఇస్తున్నాడు ఐకాన్ స్టార్.

Allu Arjun

'పుష్ప 2' (Pushpa 2) సినిమాతో బాక్సాఫీస్ దగ్గర అల్లు అర్జున్ (Allu Arjun) సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. కలెక్షన్ల వర్షం కురిపిస్తూ, గ్లోబల్ స్థాయిలో టాలీవుడ్ జెండాను పాతేశారు. సాధారణంగా ఇంత పెద్ద హిట్ కొట్టిన తర్వాత ఏ హీరో అయినా కాస్త గ్యాప్ తీసుకుంటారు, సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తారు. కానీ మన ఐకాన్ స్టార్ లెక్కే వేరు. తగ్గేదేలే అంటూ అస్సలు బ్రేక్ తీసుకోకుండా.. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెడుతూ ఇండస్ట్రీకి మైండ్ బ్లాకింగ్ షాక్స్ ఇస్తున్నారు. అయితే ఈ సారి టాలీవుడ్‌ డైరెక్టర్స్‌ కాకుండా కోలీవుడ్‌, మల్లూవుడ్‌ డైరెక్టర్స్‌ వరుస సినిమాలు ఎనౌన్స్‌ చేస్తూ అందరికీ షాక్‌ ఇస్తున్నాడు.

ప్రస్తుతం ఇండియన్ సినిమాలోనే అత్యంత భారీ కాంబినేషన్లలో ఒకటిగా నిలిచిన సినిమా 'రాకా' (Raaka). జవాన్ సినిమాతో వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి, నార్త్-సౌత్ అనే తేడా లేకుండా అందరినీ ఊపేసిన మాస్ డైరెక్టర్ అట్లీ (Atlee).. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రి-గ్లింప్స్, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో హైప్‌ను తీసుకొచ్చింది. మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్, యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా 'రాకా'సినిమా తెరకెక్కుతోంది. అల్లు అర్జున్‌ను అట్లీ ఏ రేంజ్‌లో చూపించబోతున్నాడో అని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే కాలర్ ఎగరేస్తున్నారు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ విజువల్ వండర్‌ను.. వచ్చే ఏడాది భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి పక్కా ప్లానింగ్‌తో ఉన్నారు. 'రాకా' సినిమా సెట్స్‌పై ఉండగానే.. అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమాను కూడా ఇప్పటికే ఎనౌన్స్‌ చేశారు. కోలీవుడ్ సెన్సేషన్, లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఫేమ్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)తో ఒక క్రేజీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. 'ఖైదీ, విక్రమ్, లియో' లాంటి సినిమాలతో డ్రగ్స్, గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో డార్క్ యాక్షన్ డ్రామాలను తెరకెక్కించే లోకేష్.. ఈసారి అల్లు అర్జున్ కోసం రూట్ మార్చారట. ఎవరూ ఊహించని ఒక సరికొత్త గ్లోబల్ కాన్సెప్ట్‌తో ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

ఈ ఏడాది చివరి నుంచే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. థియేటర్లలో పూనకాలు గ్యారెంటీ అని చెప్పొచ్చు! ఇక్కడితో ఈ సునామీ ఆగలేదు. అట్లీ, లోకేష్ లాంటి మాస్ డైరెక్టర్ల తర్వాత.. అల్లు అర్జున్ ఒక విభిన్నమైన రూట్ ఎంచుకున్నారు. మలయాళ సూపర్ హిట్ 'మిన్నల్ మురళి' చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ (Basil Joseph) కథకు కూడా బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు గట్టి టాక్ వినిపిస్తోంది. బాసిల్ జోసెఫ్ కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు, మలయాళంలో క్రేజీ హీరో కూడా.

అలాంటి ఒక క్రియేటివ్ మైండ్.. మన ఐకాన్ స్టార్ కోసం ఒక మైండ్ బెండింగ్ యూనిక్ కాన్సెప్ట్‌ను రెడీ చేశారట. 'రాకా' సినిమా పూర్తయ్యేలోపే ఈ ప్రాజెక్ట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. వచ్చే ఏడాది ఈ సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. ఒకవైపు అట్లీతో హై-టెక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్, ఇంకోవైపు లోకేష్ కనగరాజ్‌తో రా అండ్ రస్టిక్ డ్రామా, మరోవైపు బాసిల్ జోసెఫ్‌తో ఊహకందని సరికొత్త సబ్జెక్ట్! టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఏ హీరో కూడా ఈ రేంజ్‌లో లైనప్‌ను సెట్ చేసుకోలేదనే చెప్పాలి.

Updated Date - May 22 , 2026 | 01:40 PM