సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Raaka: రెండేళ్లుగా షూటింగ్.. అయినా సగం కూడా పూర్తికాని బన్నీ సినిమా?

ABN, Publish Date - Nov 06 , 2026 | 01:56 PM

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రాకా’ షూటింగ్‌పై ఆసక్తికర వార్తలు వైరల్ అవుతున్నాయి.

Allu Arjun, Raaka

పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్‌ను షేక్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) లైనప్‌పై ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి హైప్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాక్సాఫీస్ లెక్కల్ని తిరగరాయడంలో బన్నీ స్టైలే వేరు. అలాంటి ఐకాన్ స్టార్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ (Atlee) కాంబినేషన్‌లో వస్తున్న భారీ అంతర్జాతీయ స్థాయి చిత్రం రాకా (Raaka).

జవాన్ లాంటి ఇండస్ట్రీ హిట్‌తో బాలీవుడ్‌ని సైతం రఫ్ఫాడించిన అట్లీ, అల్లు అర్జున్‌తో చేతులు కలిపారంటే ఆ విజువల్ స్పెక్టకిల్ ఏ స్థాయిలో ఉంటుందో ఫ్యాన్స్ ఇప్పటికే ఊహించుకుంటున్నారు. గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేశారు. అయితే ఏడాదిన్నరకు పైగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్‌ ఇంకా సగం కూడా పూర్తి కాలేదనే వార్తలు సోషల్‌ మీడియాలో దుమారం లేపుతున్నాయి.

ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచే సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుందనే వార్తలు వినిపించాయి. ముఖ్యంగా ముంబైలోని భారీ స్టూడియోల్లో అదిరిపోయే సెట్స్ వేసి మరీ చిత్రీకరణ జరుపుతున్నారు. బన్నీ లుక్ దగ్గరి నుంచి ప్రతీ చిన్న డీటెయిల్‌ను అట్లీ చాలా జాగ్రత్తగా చెక్కుతూ వస్తున్నారు. దాదాపు రెండేళ్లుగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వర్క్, షూటింగ్ నిరంతరాయంగా సాగుతూనే ఉంది. బన్నీ డేట్స్ కేటాయించడం, భారీ షెడ్యూల్స్ ప్లాన్ చేయడం చూసి సినిమా ఇప్పటికే ముగింపు దశకు వచ్చి ఉంటుందని అందరూ లెక్కలేశారు. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలోనే సినిమా రిలీజ్ ఉండొచ్చని ఫ్యాన్స్ సైతం ఆశగా ఎదురుచూస్తున్నారు.

అయితే తాజాగా ఫిలిం నగర్ సర్కిల్స్ నుంచి బయటకు వచ్చిన ఒక వార్త బన్నీ ఆర్మీతో పాటు సినీ వర్గాలను సైతం తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది. ఇంత కాలం షూటింగ్ జరిపినా, ఈ చిత్రం ఇప్పటివరకు కేవలం 40 శాతం లోపే పూర్తి చేసుకుంది అనే టాక్ ఇండస్ట్రీలో తెగ చక్కర్లు కొడుతోంది. రెండేళ్ల కాలం.. అదీ ముంబై స్టూడియోల్లోనే నిర్విరామంగా వర్క్ జరుగుతున్నప్పుడు, ఇంకా సగం షూట్ కూడా పూర్తి కాలేదంటే ఇది ఒకింత నమ్మశక్యం కాని విషయమే. ఈ బజ్ విన్న అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురవుతున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే, మిగిలిన 60 శాతం చిత్రీకరణ, ఆ తర్వాత వచ్చే భారీ వీఎఫ్‌ఎక్స్ పనులకి ఇంకెంత సమయం పడుతుందోనన్న ఆందోళన మొదలైంది.

అయితే దీని వెనుక దర్శకుడు అట్లీ విజన్ వేరే ఉందనే వాదనలూ వినిపిస్తున్నాయి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో, కాంప్రమైజ్ కాకుండా ప్రతీ యాక్షన్ సీక్వెన్స్‌ను ఎంతో డీటెయిలింగ్‌తో తెరకెక్కిస్తున్నారట. అంతేకాకుండా ప్రస్తుతం సెన్సేషన్‌గా మారిన యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ ఏమాత్రం వెనకాడకుండా వందల కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

విజువల్స్ అద్భుతంగా రావాలనే ఆలోచనతోనే సమయం తీసుకుంటున్నారా లేక రీ-షూట్‌లు ఏమైనా జరిగాయా అన్నది తెలియాల్సి ఉంది. అయితే ఈ 40 శాతం షూటింగ్ వార్తల్లో నిజమెంత..? నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ లేదా దర్శకుడు అట్లీ దీనిపై ఏదైనా అఫీషియల్ క్లారిటీ ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఐకాన్ స్టార్ నుంచి రాబోయే ఈ క్రేజీ ప్రాజెక్ట్ లేట్ అయినా సరే, థియేటర్లలో రికార్డులను తిరగరాయడం ఖాయమనే నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.

Updated Date - Nov 06 , 2026 | 02:01 PM