సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అల్లు అర్జున్.. ‘రాకా’ రిలీజ్ ప్లాన్ లీక్

ABN, Publish Date - Oct 01 , 2026 | 04:23 PM

పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర మరో భారీ సునామీ రాబోతోంది.

raaka

పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర మరో భారీ సునామీ రాబోతోంది. పుష్ప రాజ్‌గా ఇండియన్ సినిమా రూపురేఖలనే మార్చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. కోలీవుడ్ కమర్షియల్ కింగ్, జవాన్‌తో వెయ్యి కోట్ల క్లబ్‌లో అడుగు పెట్టిన అట్లీ (Atlee) కలయికలో సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్‌ రాకా (Raaka Movie). అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రూపొందుతున్న ఈ భారీ విజువల్ వండర్ పై రోజురోజుకూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా రిలీజైన ప్రీ మేకింగ్‌ గ్లింప్స్‌, రీసెంట్‌గా లాంచ్ చేసిన మోకాప్ మేకింగ్ వీడియో సోషల్ మీడియాను ఎలా షేక్ చేసిందో చూశాం. హాలీవుడ్ స్థాయి టెక్నాలజీ, మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్‌‌తో వస్తున్న ఈ గ్లింప్స్ సినిమా రేంజ్ ఏంటో ప్రపంచానికి చూపించింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఫిల్మ్ నగర్ సర్కిల్స్ నుంచి మరో అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది.

అసలు మేటర్ ఏంటంటే.. ‘రాకా’ చిత్రాన్ని ఒకే పార్ట్‌తో ఆపే ఆలోచనలో మేకర్స్ లేరట. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించేందుకు పక్కా ప్లాన్ రెడీ చేశారు. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్‌ను ఏమాత్రం రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. సాధారణంగా ఒక సినిమా రెండు భాగాలుగా వస్తే.. పార్ట్ 1 రిలీజ్ అయ్యాక పార్ట్ 2 కోసం ఏళ్ల తరబడి షూటింగ్ చేస్తూ ఉంటారు. కానీ అట్లీ ప్లానింగ్ వేరే లెవల్ లో ఉంది. భారీ షెడ్యూల్స్ వేసుకుని ఒకే దెబ్బకు రెండు భాగాల షూటింగ్‌ను పూర్తి చేయాలని చూస్తున్నారు.

ఇంత భారీ బడ్జెట్ పెడుతున్నప్పుడు రిస్క్ ఉండకూడదనే ఉద్దేశంతో పాటు.. బిజినెస్ పరంగా కూడా భారీ లెక్కలు వేస్తున్నారు. ఓటీటీ రైట్స్, నాన్-థియేట్రికల్ హక్కులు, శాటిలైట్ డీల్స్ రూపంలో నిర్మాతలకు వచ్చే లాభాలను దృష్టిలో పెట్టుకుని.. కథను సాగదీయకుండా పక్కా స్క్రిప్ట్‌తో రెండు భాగాలుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మొగ్గు చూపుతున్నారు.

ఇక రిలీజ్ విషయానికి వస్తే... మైండ్ బ్లాంక్ అయ్యే డేట్స్ వినిపిస్తున్నాయి. మొదటి భాగాన్ని 2027 డిసెంబర్‌ నాటికి బాక్సాఫీస్ బరిలోకి దింపేలా సన్నాహాలు చేస్తున్నారు. ఆ వెంటనే ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా, 2028లోనే రెండో భాగాన్ని థియేటర్లలోకి తెచ్చేలా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారట. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా త్వరలోనే రాబోతోంది. ఈ రిలీజ్ ప్లాన్ వింటుంటేనే ఫ్యాన్స్‌కి పూనకాలు వస్తున్నాయి కదా! కానీ అసలైన సర్ ప్రైజ్ ఇంకా మిగిలే ఉంది.

ఈ సినిమాలో కనిపించబోయే స్టార్ కాస్టింగ్ మామూలుగా లేదు. ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడూ చూడని రేంజ్ లో ఓ భారీ తారాగణం ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాబోతోంది. బాలీవుడ్ టాప్ బ్యూటీ దీపికా పదుకోనె, నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలెంటెడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్, గ్లామరస్ సెన్సేషన్ జాన్వీ కపూర్, అలాగే మలయాళ స్టార్ ఐశ్వర్య లక్ష్మి.. ఇలా సౌత్ నుంచి నార్త్ వరకు క్రేజీ హీరోయిన్స్ అందరూ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారని టాక్ బలంగా నడుస్తోంది.

Updated Date - Oct 01 , 2026 | 04:23 PM