సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రెండు.. భాగాలుగా రాకా? లీకైన.. మైండ్ బ్లాక్ స్టోరీ!

ABN, Publish Date - Jul 29 , 2026 | 05:21 PM

రాకా సినిమాకు సంబంధించిన ఒక మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

raaka

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ఇప్పుడు ఎక్కడ చూసినా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పేరు మార్మోగిపోతోంది. పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్‌ను సొంతం చేసుకున్న బన్నీ, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం రాకా ( Raaka). ఈ సినిమాకు సంబంధించిన ఒక మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఈ సినిమా రేంజ్ ఉండబోతోందని సినీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.

ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసేలా 'రాకా' చిత్రాన్ని మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కెరీర్‌లోనే ఇది ఒక అతిపెద్ద మైలురాయిగా నిలిచిపోయేలా అట్లీ (Atlee) ఈ కథను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఏకంగా 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా కళ్లు చెదిరే విజువల్స్, భారీ యాక్షన్ సీక్వెన్సులతో ఈ ప్రాజెక్ట్‌ను అత్యున్నత సాంకేతిక విలువలతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ ప్రాజెక్ట్ గురించి బయటకు వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏమిటంటే, మొదట ఈ కథను సింగిల్ పార్ట్‌గానే అనుకున్నా, స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న కొద్దీ కథా పరిధి ఊహించిన దానికంటే భారీగా పెరిగిపోయిందట. కథలోని పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయాలంటే ఒక్క భాగం సరిపోదని భావించిన మేకర్స్, 'రాకా'ను రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో అట్లీ వేసిన మాస్టర్ ప్లాన్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక భాగం పూర్తిగా ఫాంటసీ ఎలిమెంట్స్‌తో కూడిన హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగితే, రెండో భాగం దానికి పూర్తి భిన్నంగా ఫ్యూచరిస్టిక్ వరల్డ్‌లో ఉండబోతోందట. గతం, భవిష్యత్తు అనే రెండు విభిన్న ప్రపంచాలను తనదైన మార్క్ స్క్రీన్‌ప్లేతో అట్లీ ఎలా ముడిపెడతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఈ పాన్ ఇండియా చిత్రంలో ఏకంగా ముగ్గురు స్టార్ హీరోయిన్లు సందడి చేయబోతున్నారు. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పార్ట్‌లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోణ్ నటించనుండగా, ఫ్యూచరిస్టిక్ వరల్డ్‌లో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ బన్నీ సరసన కనిపించనుందట. వీరితో పాటు నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు ఇన్‌సైడ్ టాక్. దీనికి తోడు 'జవాన్' చిత్రంతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఇందులో ఒక పవర్‌ఫుల్ క్యామియో చేయబోతున్నారనే క్రేజీ రూమర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తోంది. రెండు భాగాల షూటింగ్‌ను విడివిడిగా కాకుండా ఏకకాలంలో నిర్వహించి, ప్రేక్షకుల కోసం చాలా తక్కువ గ్యాప్‌లో థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది చివరకల్లా టోటల్ షూటింగ్ పూర్తి చేసి, విడుదల తేదీలపై అధికారికంగా క్లారిటీ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చూడాలి మరి ఈ 'రాక'తో అట్లీ - అల్లు అర్జున్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో.

Updated Date - Jul 29 , 2026 | 06:10 PM