సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బన్నీ - అట్లీ.. మ్యూజికల్‌ అప్‌డేట్‌.. పెద్ద రికార్డే అవుతుంది..

ABN, Publish Date - Mar 08 , 2026 | 08:08 PM

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) తమిళ దర్శకుడు అట్లీతో (Atlee) ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్‌ వరల్డ్‌ స్థాయిలో సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కు తోంది.

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) తమిళ దర్శకుడు అట్లీతో (Atlee) ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్‌ వరల్డ్‌ స్థాయిలో సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్‌ నుంచి ఓ అప్‌డేట్‌ వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రానికి మ్యూజిక్‌ వర్క్‌ ప్రారంభించారని, నాలుగైదు పాటలకు వర్క్‌ పూర్తి చేసినట్లు తెలిసింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ లాంటి అప్‌డేట్‌ ఏదీ రాలేదు. అలాంటి అప్‌డేట్‌ ఏదో ఒకటి ఇవ్వాలంటూ బన్నీ అభిమానులు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. బన్నీ బర్త్‌డేకి గ్లింప్స్‌కి రూపంలో అప్‌డేట్‌ ఇచ్చే అవకాశం ఉందని చిత్ర బృందం నుంచి సమాచారం.

అయితే ఇందులో హీరోయిన్లు ఎవరెవరనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె ఓ కథానాయిక అని అట్లీ ప్రకటించారు. ఇంకా ఇద్దరు హీరోయిన్లకు ఆస్కారం ఉందని తెలుస్తోంది. రష్మిక మందన్న ఓ నెగటివ్‌ పాత్రలో కనిపించనుందని చాలాకాలంగా టాక్‌ నడుస్తోంది. ఇటీవల జోర్డాన్‌షెడ్యూల్‌ పూర్తయింది. ఇప్పటికే ఓటీటీ డీల్‌ కోసం ఇంటర్నేషనల్‌ ఓటీటీ ‘నెట్‌ ఫ్లిక్స్‌’ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని భాషలకు కలిపి రూ. 600 కోట్లకు డీల్‌ కుదిరినట్లు తెలిసింది. ఇదే నిజమైతే  ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో ఇది రికార్డు అవుతుంది. సన్‌ పిక్చర్స్‌ అధినేత కళానిధి మారన్‌ దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Updated Date - Mar 09 , 2026 | 11:54 AM