ప్రధాని మోదీ వీడియోలో.. అల్లు అర్జున్ AA23 థీమ్.. దేశవ్యాప్తంగా వైరల్
ABN, Publish Date - Jun 17 , 2026 | 12:59 PM
ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా పోస్టులో అల్లు అర్జున్ నటిస్తున్న AA23 చిత్ర థీమ్ మ్యూజిక్ వినిపించడం చర్చనీయాంశమైంది. విడుదలకు ముందే ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది.
పాన్ ఇండియా ట్రెండ్‌కు ముందే దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఒకరు. తన సినిమాలు, పాటలు, డాన్స్ స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో భాషా సరిహద్దులను దాటి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు దేశం నలుమూలల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్ డమ్ సంపాదించుకున్న బన్నీ సినిమాలపై ఇప్పుడు నార్త్‌లో ప్రత్యేక క్రేజ్ సైతం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాజాగా పాన్ ఇండియా డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో 'రాకా' అనే భారీ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లోనే ఉన్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఓ వీడియోలో లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించనున్న AA23 చిత్రానికి సంబంధించిన థీమ్ మ్యూజిక్ వినిపించడం అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంకా చిత్ర నిర్మాణం ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ, దాని సంగీతం ఇప్పటికే విస్తృత స్థాయిలో గుర్తింపు పొందడం విశేషంగా భావిస్తున్నారు.
సినిమా విడుదలకు ముందే ఒక ప్రాజెక్ట్‌కు సంబంధించిన అంశాలు ప్రధాన స్రవంతి చర్చల్లోకి రావడం అరుదుగా కనిపించే విషయం. ఈ నేపథ్యంలో AA23పై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి, అల్లు అర్జున్‌కు ఉన్న విస్తృత ప్రజాదరణ మరోసారి స్పష్టమవుతోందని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు. ఇది మా 'పుష్ప' గాడి ఏంజ్ అంటూ అభిమానులు కాలర్లు ఎగరవేస్తున్నారు.