సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఏడవకపొతే కోటి.. ఏడిస్తే లక్ష.. సుకుమార్- అల్లు అరవింద్ ఛాలెంజ్

ABN, Publish Date - Nov 28 , 2026 | 10:23 PM

దర్శకుడు సుకుమార్‌కు నిర్మాత అల్లు అరవింద్ ఆసక్తికరమైన ఛాలెంజ్ విసిరారు. ఆకాశంలో ఒక తార సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకోకుండా బయటకు వస్తే కోటి రూపాయలు ఇస్తానని, ఏడిస్తే లక్ష రూపాయలు ఇవ్వాలని షరతు పెట్టారు. సినిమా చూస్తూ భావోద్వేగానికి గురైన సుకుమార్ ఛాలెంజ్‌లో ఓడిపోయి అల్లు అరవింద్ పేరు మీద లక్ష రూపాయల చెక్ రాశారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో పోస్ట్ వైరల్‌గా మారింది.

sukumar

సాధారణంగా.. ఒక ఫ్రెండ్ మంచి సినిమా చూసి.. ఆ సినిమా చూడు అని కాన్ఫిడెంట్ గా వేరే ఫ్రెండ్ కి చెప్తే, ఆ ఫ్రెండ్ ఆ సినిమా చూసి.. అరే సూపర్ ఉందిరా అంటే ఆ చెప్పిన ఫ్రెండ్ కి ఎంత గర్వంగా ఉంటుందో అందరికీ తెల్సిందే. అయితే ఇలాంటి రికమెండేషనే డైరెక్టర్ సుకుమార్ విషయంలో కొంచెం కాస్ట్లీగా జరిగింది. డైరెక్టర్ సుకుమార్ కి ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కి మధ్య ఉన్న బాండింగ్ గురించి ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. అల్లు అరవింద్ తన, మన అనే భేదం లేకుండా సినిమా ఏదైనా నచ్చితే మాత్రం అందరినీ చూడమని చెప్తూ ఉంటారు. అలానే ఈసారి ఆయన సినిమానే సుకుమార్ ని చూడమని చెప్పారు. అయితే జస్ట్ మాటలాగా చెప్పకుండా ఛాలెంజ్ విసిరారట. ఆ విషయాన్ని సుకుమార్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో చెప్పుకొచ్చాడు.


అల్లు అరవింద్ సమర్పణలో దుల్కర్ సల్మాన్ , సాత్విక వీరవల్లి ప్రధాన పాత్రల్లో నటించి ఇటీవల విడుదలైన చిత్రం ఆకాశంలో ఒక తార. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద షేక్ చేస్తోంది. ఒక్కరూ కాదు ఇద్దరు కాదు ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన విషయాయం తెల్సిందే. ఈ నేపధ్యంలోనే అల్లు అరవింద్.. సుకుమార్ కి ఫోన్ చేసి 'హేయ్ సుకుమార్, వెళ్లి ఆకాశంలో ఒక తార సినిమా చూడు. కన్నీళ్లు పెట్టుకోకుండా థియేటర్ నుంచి బయటకు వస్తే నీకు రూ. 1 కోటి ఇస్తాను. ఒకవేళ ఏడిస్తే నువ్వు నాకు రూ. 1 లక్ష ఇవ్వాలి' అని అల్లు అరవింద్ ఛాలెంజ్ చేశారట.


అల్లు అరవింద్ మాటపై సినిమాకు వెళ్లిన సుకుమార్, థియేటర్‌లో సినిమా చూస్తూ భావోద్వేగాన్ని ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నాడట. దాంతో ఛాలెంజ్‌లో ఓడిపోయిన సుకుమార్, చెప్పినట్టుగానే అల్లు అరవింద్ పేరు మీద లక్ష రూపాయలు చెక్‌ను రాసి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇక డానికి క్యాప్షన్ గా ఎంత ఖరీదైన సిఫార్సు సర్ ఇది అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గీతా ఆర్ట్స్ సమర్పణలో పవన్ సాధినేని దర్శకత్వంలో వచ్చిన ఆకాశంలో ఒక తార చిత్రం ఎంత హృదయాన్ని హత్తుకునేలా ఉందో చెప్పడానికి సుకుమార్ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సినిమాకు ఇంతకు మించిన బెస్ట్ ప్రమోషన్‌ ఇంకొకటి ఉండదు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - Nov 28 , 2026 | 10:26 PM