Allu Aravind: బాస్ ఈజ్ బాస్.. చించేశాడు
ABN, Publish Date - Jan 12 , 2026 | 07:00 PM
ఎన్నో అంచనాల మధ్య నేడు మన శంకరవరప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu) సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.
Allu Aravind: ఎన్నో అంచనాల మధ్య నేడు మన శంకరవరప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu) సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది. భోళా శంకర్ ప్లాప్ తరువాత చిరు ఒక మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అనిల్ రావిపూడి.. మరోసారి సంక్రాంతి విన్నర్ గా నిలిచాడు. చిరు కామెడీ టైమింగ్, డ్యాన్స్ అదరగొట్టేశాడు.
తాజాగా మన శంకవరప్రసాద్ గారు సినిమాకు నిర్మాత అల్లు అరవింద్ తనదైన రీతిలో రివ్యూ ఇచ్చాడు. సినిమాను వీక్షించిన అల్లు అరవింద్ మాట్లాడుతూ.. 'సినిమా చూసి వస్తుంటే ఆ ఎగ్జైట్ మెంట్.. బాస్ .. చించేశాడు. బాస్ ఈజ్ బాస్. ఆ రౌడీ అల్లు, ఆ ఘరానా మొగుడు సినిమాలు చూసినట్లు అనిపించింది. చాలా బావుంది. వింటేజ్ డ్యాన్స్ అదిరిపోయింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సహా వింటేజ్ తీసుకొచ్చేసరికి డైరెక్టర్ ఏం ఆలోచించాడులే అనిపించింది. ఎక్సలెంట్. వెంకీ ఎంట్రీ, కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్. పైసా వసూల్.. ఫుల్ ఎగ్జైట్ మెంట్ తో బయటకు వస్తారు' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అల్లు అరవింద్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
గత కొంతకాలంగా అల్లు- మెగా ఫ్యామిలీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అంటూ వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. ఈ ముఖ్యంగా అల్లు అర్జున్.. మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడని సమాచారం. కాకపోతే ఈ మధ్య ఈ రెండు కుటుంబాలు కలిసిపోయాయని తెలుస్తోంది. అల్లు అరవింద్ తల్లి మరణం తరువాత చిరు కుటుంబం కూడా కొంతవరకు అల్లు ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలబడింది. అందుకే అల్లు అరవింద్.. ఇలా చిరు సినిమాకు రివ్యూ ఇచ్చాడని మెగా ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.