సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అల్లు అర్జున్ పెట్టిన కండీషన్స్ ఇవేనా!?

ABN, Publish Date - Feb 11 , 2026 | 02:53 PM

కావేరీ బారువాకు అల్లు అర్జున్ టీమ్ పెట్టిన నిబంధనలు ఇవేనంటూ ఓ నోట్ చక్కర్లు కొడుతోంది. ఇందులో నిజానిజాలేమిటనేది తెలియాల్సి ఉంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పాడ్ కాస్ట్ సమయంలో ఆయన టీమ్ 42 షరతులు విధించారని కావేరీ బారువా (Kaveri Baruah) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ స్థాయిలో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆమె ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని అల్లు అర్జున్ పీఆర్ టీమ్ తాజాగా స్పష్టం చేసింది. ఆ తర్వాత చిత్రంగా అల్లు అర్జున్ టీమ్ ఇచ్చిన జాబితా ఇదేనంటూ 42 అంశాలతో ఓ నోట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. కావేరీ బారువా చెప్పిన అంశాలు ఈ జాబితాలో ఉండటంతో ఇది బన్నీ టీమ్ పాడ్ కాస్ట్‌కు ముందు ఇచ్చిన నోట్ అని కొందరు భావిస్తున్నారు.


ఇదే సమయంలో ఈ జాబితాలో ఉన్న అంశాల మీద కూడా చర్చ జరుగుతోంది. సెలబ్రిటీస్ ను కలిసేప్పుడు ఇలాంటి సూచనలు చేయడం సహజమని, ఇందులో అభ్యంతరం ఏముందని కొందరంటున్నారు. పెద్ద పెద్ద టాలీవుడ్ స్టార్స్ సైతం ఇలాంటి షరతులు విధించరని, అక్కడి వాతావరణాన్ని అర్థం చేసుకుని మీడియా పీపుల్ మసలు కుంటారని, అలా కాకుండా 'చేయాల్సిన పనులు, చేయకూడని పనులు' అంటూ నిబంధనలు పెట్టడం దారుణమని వాదిస్తున్న వారూ లేకపోలేదు. అలానే 'పుష్ప, పుష్ప-2' చిత్రాలు జాతీయ స్థాయిలో ఘన విజయం సాధించిన తర్వాత అల్లు అర్జున్ వ్యవహార శైలిలో మార్పు వచ్చిందని, ఆయన బాడీ లాంగ్వేజ్ సైతం మారిపోయిందని కొందరు విమర్శిస్తున్నారు. మరి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న 42 నిబంధనల పట్టికపై బన్నీ టీమ్ ఎలా స్పందిస్తారో చూడాలి!


అల్లు అర్జున్ టీమ్ పెట్టిన షరతుల జాబితాలోని కొన్ని అంశాలు మరీ చిత్రంగా ఉన్నాయని కొందరు చెబుతున్నారు. అందులో ఏ పరిస్థితుల్లోనూ షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు, కనీసం మూడు అడుగుల భౌతిక దూరం పాటించాలి, స్టైలిస్ట్ స్టార్ అని కాకుండా ఐకాన్ స్టార్ అని మాత్రమే సంబోధించాలి, కంటికి ఇబ్బంది కలిగే దుస్తులు, ఆభరణాలు ధరించకూడదు, అల్లు అర్జున్ గదిలోకి రాగానే లేచి నిలబడాలి, వ్యక్తిగత విషయాలను హాలు బయటకు వెళ్ళి మాట్లాడాలి, ఫోన్ కనిపించేలా పెట్టకూడదు, వ్యక్తిగత అంశాలు, కుటుంబ వివరాలు అడగకూడదు, ఫ్యాన్స్‌లా ప్రవర్తించకూడదు, ఆటోగ్రాఫ్స్, సెల్ఫీస్ కోరకూడదు. వెనక్కి వెళ్ళేప్పుడు వీపు చూపించకూడదు... వంటి అంశాలు ఇందులో ఉన్నాయి.

Updated Date - Feb 11 , 2026 | 05:21 PM