చిద్రమైన మనిషి.. గొప్పదైన శక్తిని ఎదుర్కొంటే...
ABN , Publish Date - Apr 07 , 2026 | 03:09 PM
తమిళ సినీ ఇండస్ట్రీలో విజయవంతమైన స్టూడియో అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. టెంపుల్ టౌన్ పిక్చర్స్‌తో కలిసి ‘కనక దుర్గ’ టైటిల్ తో ఓ సినిమా నిర్మిస్తోంది.
తమిళ సినీ ఇండస్ట్రీలో విజయవంతమైన స్టూడియో అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. టెంపుల్ టౌన్ పిక్చర్స్‌తో కలిసి ‘కనక దుర్గ’ టైటిల్ తో ఓ సినిమా నిర్మిస్తోంది. అల్లరి నరేష్, కాజల్ చౌదరి జంటగా నటిస్తున్నారు. సుబ్బరాజు కీలక పాత్రలో కనిపిస్తారు. బి.వి.ఎస్. రవి కథ అందిస్తుండగా.. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. సమీర్ నాయర్, దీపక్ సెహగల్, అజిత్ ఠాకూర్, బి.వి.ఎస్.రవి నిర్మాతలు.
శనివారం ఈ సినిమా పూజ కార్యక్రమాలతో మొదలైంది. తొలి సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, సురేఖ కొణిదెల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. స్వప్న దత్ గౌరవ దర్శకత్వం వహించారు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి స్క్రిప్ట్‌ను అందించారు. హరీష్ శంకర్, మిక్కిలినేని సుధాకర్, కోన వెంకట్, ప్రశాంత్ వర్మ, మధుర శ్రీధర్, సుప్రియ, విద్యా కొప్పినీడు, పద్మ కస్తూరి రంగన్, అనురాధ గూడూరు, దివ్య విజయ్, హన్షిత రెడ్డి, జాన్వీ నారంగ్, స్రవంతి చొక్కారపు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

దర్శకుడు ప్రదీప్ మద్దాలి మాట్లాడుతూ 'కనక దుర్గ’ సినిమా నాకు చాలా ప్రత్యేకం. దర్శకుడిగా మాత్రమే కాదు, ఆ అమ్మవారిపై నాకు ఉన్న భక్తి కూడా దీనికి కారణం. ఈ కథ భక్తి గురించి మాత్రమే కాదు..జీవితంలో చిద్రమైన ఒక మనిషి, తనకంటే గొప్పదైన శక్తిని ఎదుర్కొన్నప్పుడు ఏమి జరుగుతుందో చెప్పే కథే ఇది. మా కథను నమ్మి ‘అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్’ లాంటి సంస్థ ముందుకు రావడం, అలాగే ‘టెంపుల్ టౌన్ పిక్చర్స్’ ఈ ప్రాజెక్ట్‌ను ఇంత నమ్మకంతో ముందుకు తీసుకెళ్లడం చాలా ఆనందంగా ఉంది' అన్నారు.
అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ బిజినెస్ హెడ్ సునీల్ చైనాని మాట్లాడుతూ 'తమిళంలో మా ప్రయాణం ఎంతో ప్రోత్సాహకరంగా, విజయవంతంగా సాగింది. ఇప్పుడు ‘కనక దుర్గ’తో తెలుగులోకి అడుగుపెడుతుండటం ఎంతో ఆనందంగా ఉంది. భక్తి, సంస్కృతి, భావోద్వేగాల కలయికలతో ఈ సినిమా రూపొందుతోంది' అన్నారు.