క్రేజీ కళ్యాణం.. మెలోడీ సాంగ్ అదిరింది
ABN, Publish Date - Oct 02 , 2026 | 08:53 PM
అందాల భామ అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్,అఖిల్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం క్రేజీ కళ్యాణం (Crazy Kalyanam). భద్రప్ప గజూల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని యారో సినిమాస్ బ్యానర్‌పై భూసం జగన్ రెడ్డి నిర్మించాడు.
అందాల భామ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), తరుణ్ భాస్కర్,అఖిల్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం క్రేజీ కళ్యాణం (Crazy Kalyanam). భద్రప్ప గజూల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని యారో సినిమాస్ బ్యానర్‌పై భూసం జగన్ రెడ్డి నిర్మించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ , టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
అలసెంద్రవంక అంటూ సాగిన ఈ గీతం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ అందమైన పాటకు సురేష్ బొబ్బిలి స్వరాలు సమకూర్చగా, ప్రముఖ గాయకుడు అనురాగ్ కులకర్ణి తన మధురమైన గొంతుతో ఆలపించాడు. జి. వెంకన్న అందించిన సాహిత్యం పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గ్రామీణ నేపథ్యం, స్వచ్ఛమైన అనురాగం మేళవింపుగా సాగే ఈ పాట సంగీత ప్రియులను అలరిస్తోంది.
విజువల్స్ పరంగా అనుపమ పరమేశ్వరన్ క్యూట్ లుక్స్, అఖిల్ రాజ్ కెమిస్ట్రీ పాటలో ప్రధాన హైలైట్‌గా నిలిచాయి. స్క్రీన్ పై వీరిద్దరి జోడీ ఎంతో ఫ్రెష్‌గా ఉందంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తన ప్రియురాలి అందాన్ని మెచ్చుకుంటూ.. తనలోని ప్రేమ భావాలను అబ్బాయి బయటపెట్టే సమయంలో ఈ సాంగ్ వస్తుందని తెలుస్తోంది. అనుపమ ఈ సినిమాపై ఎన్నో అంచనాలను పెట్టుకుంది. తరుణ్ భాస్కర్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించడంతో కామెడీకి ఎక్కడా లోటు ఉండదని అర్ధమవుతోంది. ఈ సినిమా అక్టోబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా అనుపమకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.