సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

'అలా బోలేలో'.. జైలర్-2 నుంచి షుషారెత్తించే పాటోచ్చేసింది

ABN, Publish Date - Aug 21 , 2026 | 06:56 PM

అభిమానులు చాలాకాలంగా ఎదురు చూస్తున్న రోజు రానే వ‌చ్చింది. సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్-2 చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్‌ను మేక‌ర్స్‌ శుక్ర‌వారం విడుద‌ల చేశారు.

jailer

అభిమానులు చాలాకాలంగా ఎదురు చూస్తున్న రోజు రానే వ‌చ్చింది. సూపర్ స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth) హీరోగా నటించిన జైలర్-2 (Jailer 2) చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్‌ను మేక‌ర్స్‌ శుక్ర‌వారం విడుద‌ల చేశారు. అలా బోలేలో (Ala Bolelo Lyric Video) అంటూ సాగే ఈ హుషారైన పాట‌కు శ్రీనివాస మౌళి (Srinivasa Mouli) సాహిత్యం అందించ‌గా స్వీయ సంగీతంలో అనిరుధ్ ర‌విచంద‌ర్ (Anirudh Ravichander) ఆల‌పించాడు. జైల‌ర్ మొద‌టి భాగంలో త‌మ‌న్నాపై చిత్రీక‌రించిన పాట దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే.

అయితే.. ఈ ద‌ఫా పూర్ణపై చిత్రీక‌రించిన ప్ర‌త్యేక గీతం ఆ పాట అంచ‌నాల‌ను అందుకునేంత‌గా ఏ కోశానా క‌నిపించ‌డం లేదు. డ్యాన్స్ మూవ్స్ అన్నీ ఎక్ట్రాన్డిన‌రీగా ఉన్న‌ప్ప‌టికీ ట్యూన్ అంత‌గా క్యాచీగా లేకపోవ‌డంతో జ‌నాల‌కు ఆడియ‌న్స్‌కు అంత‌గా ఎక్కేలా లేదు. ఇదిలాఉంటే.. నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) దర్శకత్వంలో సన్ పిక్చర్స్ (Sun Pictures) బ్యాన‌ర్‌పై నిర్మాత కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ మూవీని అక్టోబరు 15వ తేదీన విడు దల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - Aug 21 , 2026 | 07:04 PM