సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Akkineni Nagarjuna: లెనిన్ రివ్యూ చెప్పిన నాగ్.. నమ్మొచ్చా

ABN, Publish Date - Apr 29 , 2026 | 12:57 PM

అక్కినేని వారసుడు అఖిల్ (Akhil Akkineni) హిట్ కొడితే చూడాలని ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోన్న విషయం అందరికి తెల్సిందే.

Lenin Movie

అక్కినేని వారసుడు అఖిల్ (Akhil Akkineni) హిట్ కొడితే చూడాలని ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోన్న విషయం అందరికి తెల్సిందే. ఏజెంట్ లాంటి భారీ డిజాస్టర్ తరువాత చాలా గ్యాప్ తీసుకొని అఖిల్ చేస్తోన్న చిత్రం లెనిన్ (Lenin). మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. ఇప్పటికే లెనిన్ నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా మెప్పించడంతో పాటు సినిమాపై భారీ అంచనాలను తీసుకొచ్చిపెట్టాయి.


జూన్ 26 న లెనిన్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. తాజాగా లెనిన్ మొదటి రివ్యూను అక్కినేని నాగార్జున ఇచ్చేశారు. సినిమా ఫస్ట్ కట్ చూసినట్లు ఆయన ఎక్స్ ద్వారా అభిమానులకు తెలిపారు. మునుపెన్నడూ చూడని అఖిల్ ని లెనిన్ లో చూస్తారని చెప్పుకొచ్చారు. ' గతరాత్రి లెనిన్ ఫస్ట్ కట్ చూశాను. అది చూశాక ఎంతో నమ్మకంతో, గర్వంతో చెప్తున్నాను. మీరందరూ జూన్ 26 న కొత్త అఖిల్ ని చూస్తారు. డేట్ ని మార్క్ చేసుకోండి. థియేటర్ లో కలుద్దాం' అంటూ పోస్ట్ పెట్టారు. దీంతో లెనిన్ పై ప్రేక్షకులకు పాజిటివ్ వైబ్ వచ్చింది. మరి నాగ్ చెప్పినట్టే లెనిన్ లో కొత్త అఖిల్ కనిపించి హిట్ అందుకుంటాడా.. ? నాగ్ రివ్యూని నమ్మొచ్చా.. లేదా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే.

Updated Date - Apr 29 , 2026 | 01:08 PM