Akkineni Nagarjuna: మొన్న చిరు.. నేడు నాగ్.. సెట్ అయ్యేనా
ABN, Publish Date - Apr 28 , 2026 | 07:25 PM
టెక్నాలజీని ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా బాగా వాడుకొంటుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఏఐ టెక్నాలజీ ద్వారా కొత్త ప్రపంచాన్నే చూపిస్తున్నారు దర్శకులు.
టెక్నాలజీని ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా బాగా వాడుకొంటుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఏఐ టెక్నాలజీ ద్వారా కొత్త ప్రపంచాన్నే చూపిస్తున్నారు దర్శకులు. ముఖ్యంగా ఇప్పుడు వయసైన హీరోలను వారి యుక్త వయస్సులో ఉన్నట్లు చూపించడం ట్రెండ్ గా మారింది. ఆచార్య చిత్రంలో చిరంజీవిని టెక్నాలజీ ఉపయోగించి యంగ్ లుక్ లో చూపించారు డైరెక్టర్ కొరటాల శివ. రిస్క్ చేసినా చిరుకు ఫలితం దక్కలేదు. అప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వలన చిరు లుక్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కానీ, ఏఐ వచ్చాక వింటేజ్ లుక్ ని క్రియేట్ చేయడం ఈజీగా మారింది. అందుకు ఉదాహరణే కూలీ. ఈ సినిమాలో రజనీకాంత్ ను యంగ్ లుక్ చూపించి లోకేష్ కనగరాజ్ సక్సెస్ అయ్యారు. సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా రజనీ యంగ్ లుక్ కి మాత్రం మంచి ఆదరణ లభించింది. ఇక ఇప్పుడు ఈ యంగ్ లుక్ ని అక్కినేని నాగార్జున కూడా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
అక్కినేని నాగార్జున వందవ సినిమా కింగ్ 100. తమిళ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో టబు హీరోయిన్ గా నటిస్తోన్నారు. ఎలాంటి హడావిడి లేకుండా ఈ సినిమా షూటింగ్ ని జరుపుకొంటుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త ప్రేక్షకుల్లో ఎక్కువ ఆసక్తిని రేకెత్తిస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో నాగ్ ని పాతికేళ్ళ కుర్రాడిగా చూపించనున్నారట. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి నాగ్ వింటేజ్ లుక్ ని క్రియేట్ చేయనున్నట్లు తెలుస్తోంది. పాతికేళ్ళ క్రితం అంటే శివ సమయంలో నాగ్ ఎలా ఉండేవారో.. అలా కనిపించబోతున్నారట. ఆచార్య సమయంలో ఇలా చేయడానికి ఖర్చు ఎక్కువ అయినా.. ఇప్పుడు మాత్రం పెద్దగా ఖర్చు కూడా లేకపోవడంతో నాగ్ సైతం ఓకే అన్నారని టాక్. ఇదే కనుక నిజమైతే మన్మథుడు వింటేజ్ లుక్ చూడడానికి అయినా ఫ్యాన్స్ థియేటర్స్ కి పరుగులు తీస్తారని అక్కినేని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి పాతికేళ్ల కుర్రాడిగా నాగ్ అభిమానులను మెప్పిస్తారా.. ? లేదా అనేది చూడాలి.