ఒకే ఫ్రేమ్‌లో అక్కినేని కుటుంబం.. చూడడానికి రెండు కళ్లు సరిపోవడం లేదే
ABN, Publish Date - Sep 21 , 2026 | 04:08 PM
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు (ANR) తెలుగు చిత్రపరిశ్రమకు అందించిన సేవలు అపారమైనవి. ఏడు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన సినీ ప్రస్థానంలో ఎన్నో మరపురాని, అద్భుతమైన పాత్రలను పోషించారు.
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు (ANR) తెలుగు చిత్రపరిశ్రమకు అందించిన సేవలు అపారమైనవి. ఏడు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన సినీ ప్రస్థానంలో ఎన్నో మరపురాని, అద్భుతమైన పాత్రలను పోషించారు. దేవదాసు, మాయాబజార్, మిస్సమ్మ, దసరా బుల్లోడు, ప్రేమాభిషేకం, ప్రేమ్ నగర్, మేఘసందేశం వంటి కావ్యాల్లాంటి సినిమాలు ఆయన నటనా విశ్వరూపానికి నిదర్శనాలు. జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో ఏ పాత్ర చేపట్టినా అందులో జీవించి, తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని, ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు.
ఈ మహానటుడు 1923 సెప్టెంబర్ 20న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లాలోని వెంకటరాఘవాపురం గ్రామంలో ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే నాటకాల పట్ల ఉన్న ఆసక్తితో రంగాస్థలంపై నటుడిగా ప్రయాణం ప్రారంభించి, ఆ తర్వాత వెండితెరకు పరిచయమయ్యారు. సుదీర్ఘ కాలం పాటు తెలుగు ప్రేక్షకులను తన నటనతో అలరించిన ఏఎన్నార్, క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ 2014 జనవరి 22న హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు. ఆయన జననం నుండి నిర్యాణం వరకు సాగిన ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.
ఇక ప్రతి ఏడాది ఏఎన్నార్ జయంతిని అక్కినేని కుటుంబం ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటుంది. తాజాగా ఆయన జయంతిని పురస్కరించుకుని అక్కినేని కుటుంబ సభ్యులందరూ ఒకచోటకు చేరారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులందరూ కలిసి దిగిన ఒక అరుదైన గ్రూప్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ అక్కినేని అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ ఫోటోలో అక్కినేని నాగార్జున, ఆయన సతిమణి అమల అక్కినేనిలతో పాటు యంగ్ హీరోలు నాగచైతన్య, అఖిల్ అక్కినేని వారి భాగస్వాములు శోభిత ధూళిపాళ, జైనబ్ తో కలిసి నవ్వుతూ కనిపించారు. వీరితో పాటు సుమంత్, సుప్రియ, అక్కినేని వెంకట్, అక్కినేని నాగ సుశీల, ఇతర కుటుంబ సభ్యులు, చిన్నారులు అందరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అక్కినేని ఫ్యాన్స్‌కు పండగలా అనిపిస్తోంది.
ఏఎన్నాఆర్ వారసత్వాన్ని, ఆయన అందించిన సినీ రంగానికి చెందిన సేవలను గుర్తుచేసుకుంటూ కుటుంబ సభ్యులు ఈ వేడుకను నిర్వహించారు. మూడు తరాల అక్కినేని కుటుంబ సభ్యులందరూ ఒకేచోట చేరిన ఈ ఫోటో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలవడంతో పాటు, ది రియల్ క్లాసీ అక్కినేని ఫ్యామిలీ.. చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు అంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Rashmika Mandanna: షూటింగ్‌కు వెళ్లాలంటే.. వణుకు పుట్టింది
మళ్లీ ఏమైందిరా.. వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్‌పై సస్పెన్స్
Husharu Pittalu: ఒరేయ్.. ఏం సినిమారా ఇది.. ఇంట్లోవాళ్లతో చూస్తే చెప్పుతో కొడతారు