సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

డ్రాగ‌న్‌లో అక్కినేని వారసుడు? య‌వ్వారం మాములుగా లేదుగా

ABN, Publish Date - Feb 26 , 2026 | 07:41 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కలయికలో ఓ భారీ ప్రాజెక్ట్ రానున్న విషయం తెలిసిందే.

Ntr Dragon

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కలయికలో ఓ భారీ ప్రాజెక్ట్ రానున్న విషయం తెలిసిందే. డ్రాగన్ (Dragon) అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇంకా అధికారికంగా పేరును ఖరారు చేసుకోవాల్సి ఉంది. బ్రూస్ లీ అనే మ‌రో పేరు కూడా ప‌రిశీల‌న‌లో ఉంది. ఇటీవల జోర్డాన్ షెడ్యూల్‌ను విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న తారక్, తన తదుపరి షెడ్యూల్ కోసం సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో ఈ మూవీకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియా వేదికగా విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌లో ఒక యంగ్ హీరో భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది. అతడు మరెవరో కాదు, అక్కినేని వారసుడు అఖిల్ (Akhil Akkineni). ఈ సినిమాలో ఒక అత్యంత కీలకమైన గెస్ట్ రోల్ కోసం అఖిల్ నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొంత కాలంగా ప్రశాంత్ నీల్, అఖిల్ మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఈ క్రమంలోనే కథలోని ఒక ప్రత్యేక పాత్ర కోసం అఖిల్ అయితేనే పూర్తి న్యాయం జరుగుతుందని దర్శకుడు భావించినట్లు సమాచారం.

అటు యంగ్ టైగర్ ఎన్టీఆర్, అఖిల్ అక్కినేని మధ్య గల ఆత్మీయ అనుబంధం గురించి ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం, స్నేహం కారణంగానే ఈ ప్రాజెక్టులోకి అఖిల్ అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. తారక్ మీద ఉన్న అభిమానంతో, ప్రశాంత్ నీల్ అడగగానే అఖిల్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. ఈ ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూడటం అభిమానులకు నిజంగా ఒక కన్నుల పండుగ అని చెప్పవచ్చు.

ఈ సినిమాలో అఖిల్ చేసే పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ, కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. స్క్రీన్ మీద కనిపించేది కాసేపే అయినా, ఆ పాత్ర ఇచ్చే ఇంపాక్ట్ మాత్రం చాలా బలంగా ఉంటుందని సమాచారం. ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో చిన్న పాత్రలను కూడా ఎంతో పవర్‌ఫుల్ గా తీర్చిదిద్దుతారు. ఇప్పుడు అఖిల్ కోసం కూడా ఒక సాలిడ్ రోల్ సిద్ధం చేశారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

ఎన్టీఆర్ మాస్ పవర్, ప్రశాంత్ నీల్ టేకింగ్ స్టైల్‌కు తోడుగా ఇప్పుడు అక్కినేని హీరో తోడవ్వడం సినిమాపై అంచనాలను ఒక్కసారిగా రెట్టింపు చేసింది. అఖిల్ ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో అటు నందమూరి అభిమానులు, ఇటు అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు. సోషల్ మీడియాలో ఈ క్రేజీ కాంబో గురించి ఇప్పటి నుంచే మీమ్స్, పోస్ట్‌లతో హంగామా మొదలైపోయింది.

ఈ అదనపు ఆకర్షణ సినిమా బిజినెస్ రేంజ్‌ను కూడా పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ, చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక స్పందన రాలేదు. అఖిల్ పాత్రపై క్లారిటీ రావాలంటే మేకర్స్ అనౌన్స్ చేసే వరకు వేచి చూడాల్సిందే. ఒకవేళ ఇదే నిజమైతే, బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సృష్టించే రికార్డులు మామూలుగా ఉండవు.

Updated Date - Feb 26 , 2026 | 09:50 AM