Nagarjuna: లెనిన్ కొత్త డేట్ ఇదే.. నాగార్జున క్లారిటీ
ABN, Publish Date - Jun 13 , 2026 | 05:44 PM
అఖిల్ అక్కినేని (Akhil) హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ (lenin) చిత్రం విడుదల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. జూన్ 26న రావలసిన ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది.
అఖిల్ అక్కినేని (Akhil) హీరోగా నటిస్తున్న ‘లెనిన్’ (lenin) చిత్రం విడుదల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. జూన్ 26న రావలసిన ఈ చిత్రం మరోసారి వాయిదా పడింది. కొత్త విడుదల తేదీని స్వయంగా నాగార్జునే (Nagarjuna) ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ పోస్ట్ చేశారు.
‘లెనిన్’ టీమ్ నా దగ్గరకు వచ్చి చిన్న రిక్వెస్ట్ చేశారు. సినిమా అవుట్‌పుట్ ఇంకాస్త మెరుగుగా తీసుకురావడానికి, 100 శాతం కొత్తదనం చూపించి సినిమాను మరింత ప్రత్యేకం చేయడానికి ఇంకాస్త సమయం కావాలని కోరారు. టీమ్ పాషన్, డెడికేషన్ చూసి కాదనలేకపోయాను. ‘మనోడు జూలై 10న వస్తున్నాడు’. ఈసారి కొత్త అఖిల్‌ను చూస్తారు. లెనిన్ ఎక్స్‌పీరియన్స్ కోసం రెడీగా ఉండండి’ అని ట్వీట్ చేశారు. అఖిల్ సరసన భాగ్యశ్రీ భోర్సే నటిస్తున్న ఈ చిత్రానికి మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మాతలు.
ఇవి కూడా చదవండి:
1.6 కిలోల వెండి ఖడ్గం.. మొక్కు తీర్చుకున్న సీఎం విజయ్!
వారెవ్వా అనిల్ రావిపూడి.. నీ చర్యలు ఊహాతీతం!
Samantha: సమంత ‘లేడీ బాషా’.. బాబోయ్ ఈ ఎలివేషన్స్ ఏంటి?