సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Akhil Akkineni: 11 ఏళ్ళ కష్టం.. తండ్రిని పట్టుకొని భోరున ఏడ్చిన అయ్యగారు

ABN, Publish Date - Jul 10 , 2026 | 07:19 PM

సక్సెస్ ఎంత ఉత్సాహాన్ని ఇస్తుందో అందరికీ తెల్సిందే. కానీ, ఒక ఫెయిల్యూర్ మాత్రం ఎన్నో అవమానాలను ఇస్తుంది. అదే ఫెయిల్యూర్స్ ఒకదాని తరువాత ఒకటి వస్తూ ఉంటే.. ఆ బాధను వర్ణించడానికి మాటలు కూడా రావు.

Akhil Akkineni

సక్సెస్ ఎంత ఉత్సాహాన్ని ఇస్తుందో అందరికీ తెల్సిందే. కానీ, ఒక ఫెయిల్యూర్ మాత్రం ఎన్నో అవమానాలను ఇస్తుంది. అదే ఫెయిల్యూర్స్ ఒకదాని తరువాత ఒకటి వస్తూ ఉంటే.. ఆ బాధను వర్ణించడానికి మాటలు కూడా రావు. అసలు హీరో అవ్వలేడు.. తండ్రీ స్టార్ హీరో అయినా.. కొడుకును హీరోగా నిలబెట్టలేకపోతున్నాడు. డబ్బు ఉన్నా హిట్ కావాలంటే టాలెంట్ ఉండాలి. యాక్టింగ్ రాదు.. రీ రీ రీ లాంచ్ లు చేస్తూ పోతారా.. గత 11 ఏళ్లగా అక్కినేని వారసుడు అక్కినేని అఖిల్ (Akkineni Akhil) ఈ అవమానాలను పడుతూ వస్తున్నాడు. అయినా ఎక్కడా క్రుంగిపోకుండా.. పడి లేచిన కెరటంలా లెనిన్ (Lenin) తో దూసుకొచ్చాడు. హిట్ కొట్టాడు. అయ్యగారి పడిన కష్టానికి ఇన్నాళ్ళకు ఫలితం దక్కింది. ఎట్టకేలకు 11 ఏళ్ల కష్టం ఫలించింది.


అఖిల్ అక్కినేని ఒక మంచి సక్సెస్ కొట్టాలని ఎంతో ఆశగా, సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న అక్కినేని అభిమానుల కల నెరవేరింది. అఖిల్ హీరోగా, మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందిన రూరల్ యాక్షన్ డ్రామా లెనిన్ ఎట్టకేలకు బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్‌ను అందుకుంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించిన ఈ చిత్రం, ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్లలో చాలా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. మునుపెన్నడూ లేని అఖిల్ ని ఫ్యాన్స్ చూశారు. ఆ నటనలో ఎంతో కసి ఉందని ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు. ఈ సినిమాలో ముఖ్యంగా అఖిల్ వన్-మ్యాన్ షో నటన, ద్వితీయార్ధంలో వచ్చే అస్సలు ఊహించని ట్విస్ట్‌లు ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్నాయి.


ఇక ఇన్నాళ్ళకు అఖిల్ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుండటంతో అక్కినేని క్యాంప్‌లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్‌లో లెనిన్ చిత్ర బృందం ఘనంగా సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. మూవీ టీమ్ అంతా కలిసి కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ వేదికపై ఒక అత్యంత భావోద్వేగ భరితమైన దృశ్యం చోటుచేసుకుంది. తన కెరీర్‌లో మొదటి హిట్ రావడంతో అఖిల్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. తండ్రి, కింగ్ నాగార్జున పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడమే కాకుండా నాగార్జునను గట్టిగా హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. నాగ్ సైతం కొడుకును పట్టుకొని ఏడ్చాడు. పైకి ఎంత నవ్వినా.. నాగ్ మనసులో ఎప్పుడు కొడుకులు ఇంకా సక్సెస్ అందుకోలేదే అన్న బాధ కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఆ బాధనే కన్నీళ్ల రూపంలో బయటకు వచ్చాయి. తండ్రీకొడుకుల మధ్య జరిగిన ఈ ఎమోషనల్ మూమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కళ్లల్లో నీళ్లు తెప్పిస్తోంది. ఇది కదా సక్సెస్ అంటే.. ఇది కేవలం అఖిల్ సక్సెస్ మాత్రమే కాదు. ఇది ఒక తండ్రి విజయం అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

Updated Date - Jul 10 , 2026 | 07:44 PM