సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నాగదుర్గతో అఖిల్ పూజలు.. అసలు నిజం ఇదిగో

ABN, Publish Date - Aug 14 , 2026 | 05:02 PM

రాజు వెడ్స్ రాంబాయి సినిమా ద్వారా నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అఖిల్ రాజ్, మరోవైపు తనదైన జానపద నృత్యాలతో యూట్యూబ్, సోషల్ మీడియా వేదికలపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న డ్యాన్స్ సెన్సేషన్ నాగదుర్గ కలయిక ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Shanarthi

రాజు వెడ్స్ రాంబాయి సినిమా ద్వారా నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అఖిల్ రాజ్, మరోవైపు తనదైన జానపద నృత్యాలతో యూట్యూబ్, సోషల్ మీడియా వేదికలపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న డ్యాన్స్ సెన్సేషన్ నాగదుర్గ కలయిక ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వీరిద్దరూ కొమురవెల్లి మల్లన్న స్వామి గుడి ప్రాంగణంలో కలిసి కనిపించడంతో, సోషల్ మీడియాలో వీరి మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ నెటిజన్లలో జోరుగా పుకార్లు వ్యాపించాయి. అయితే, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేలిపోయింది. వీరి కలయిక వెనుక ఉన్న అసలు నిజం ఒక కొత్త సినిమా.


అఖిల్ రాజ్- నాగదుర్గ జంటగా ఆదిత్య మూవీస్ సమర్పణలో, శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్, ప్రముఖ దర్శకుడు సంపత్ నంది టీమ్‌వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం శనార్తి. గణేష్ రాజ్ ఉప్పునూటి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, ఇక్కడి మట్టి వాసన నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను పూజా కార్యక్రమాల అనంతరం మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు. చేతులకు పసుపు, కుంకుమలతో సంప్రదాయబద్ధంగా ఉన్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.


ఇక ఈ సినిమా పూజా కార్యక్రమాలు చాలాఘనంగా నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ క్లాప్ కొట్టి చిత్రబృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక అఖిల్ - నాగదుర్గ గుడికి వెళ్ళడం ఈ సినిమాకు బాగా కలిసివచ్చింది. వీరిద్దరూ జంటగా కనిపించడంతో అందరూ వీరు ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని పుకార్లు రావడం వలన సినిమాకు పబ్లిసిటీ వచ్చేసింది. ఇక కేవలం సినిమా ప్రాజెక్ట్ కోసమే తాము కలిసి గుడికి వచ్చామని ఈ జంట స్పష్టం చేయడంతో వీరిద్దరిపై వచ్చిన ఊహాగానాలకు తెరపడింది. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాతో ఈ జంట ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Updated Date - Aug 14 , 2026 | 05:02 PM