సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Nagarjuna: ఆ పేరు వినగానే సెంటిమెంట్‌గా కనెక్ట్‌ అయ్యా..

ABN, Publish Date - Jul 06 , 2026 | 02:19 PM

రాయలసీమ నేపథ్యంలో సాగే కథ ఇది. ఇప్పటిదాకా అఖిల్‌ అర్బన్‌ కథలే చేశాడు. ఈ కథకు అతను సూట్‌ అవుతాడా లేదా అని భయపడ్డా.

‘రాయలసీమ నేపథ్యంలో సాగే కథ ఇది. ఇప్పటిదాకా అఖిల్‌ అర్బన్‌ కథలే చేశాడు. ఈ కథకు అతను సూట్‌ అవుతాడా లేదా అని భయపడ్డా. కానీ అవుట్‌పుట్‌ చూసి నాతోపాటు అందరూ ఆశ్చర్యపోయారు. అఖిల్‌ పూర్తిగా లెనిన్‌గా మారిపోయాడు’ అని అన్నారు అక్కినేని నాగార్జున. అఖిల్‌ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సె జంటగా నటించిన చిత్రం ‘లెనిన్‌’. మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకుడు.  అన్నపూర్ణ స్టూడియోస్‌ సమర్పణలో నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ నెల 10న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి తిరుపతిలో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు.

నాగార్జున మాట్లాడుతూ ‘మురళీ కథ వినిపించడానికి వచ్చినప్పుడు శ్రీరామాపురంలో జరిగే కథని చెప్పడం, అది నాన్న పుట్టిన ఊరు పేరు కావడంతో సెంటిమెంట్‌గా అనిపించింది. కథ విన్నాక పాత్రల్లో బిన్నమై కోణాలు కనిపించాయి. ఇందులో మలుపులు ఎవరికీ అందవు. ఓ అందమైన ప్రేమకథ ఉంది. భారతి పాత్ర గుండె చప్పుడులా ఉంటుంది. ఆ పాత్రకు భాగ్యశ్రీ పర్ఫెక్ట్‌ యాప్ట్‌. ఇది రాయలసీమ నేపథ్యంలో సాగే కథ. ఇప్పటిదాకా అఖిల్‌ అర్చన్‌ కథలే చేశాడు. ఈ కథకు అతను సూట్‌ అవుతాడా లేదా అని భయపడ్డా. కానీ అవుట్‌పుట్‌ చూసి ఆశ్చర్యపోయా. అఖిల్‌ పూర్తిగా లెనిన్‌గా మారిపోయాడు. సినిమా చేశాక అతని ప్రేమను, స్నేహాన్ని, పగను కూడా ప్రేమిస్తారు. అతన్ని మీతో పాటు ఇళ్లకు తీసుకెళ్లిపోతారు. జులై 10న వస్తున్నాం.. మనవాడు కొడుతున్నాడు’ అన్నారు.

నా సినిమానే మాట్లాడుతుంది: అఖిల్‌ అక్కినేని

‘రెండేళ్లు గ్యాప్‌ వచ్చింది. అందుకు చాలా బాధగా ఉంది. దాదాపు రెండున్నరేళ్లు ఎవరితో కమ్యునికేట్‌  చేయలేకపోతున్నా.. ముఖం చూపించ లేకపోతున్నా. ఇది నేను నిజాయతీగా అంగీకరించాల్సిందే. అందరూ క్షమించాలి. ఈరోజు పాజిటివ్‌ వైబ్‌తో ఇక్కడికి వచ్చారు. దానికి కారణం లెనిన్‌. దీంతో అందరి ఇంటివాణ్ని అయిపోవాలి.. ప్రతి ఒక్కరూ నన్ను తమ ఇళ్లకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో  చేసిన సినిమా ఇది. మురళీ ఈ కథ చెప్పిన వెంటనే.. నా బాధ, నా ప్రయాణమంతా కనిపించాయి. అందుకే ఈ కథను నాతోనే చేయమని రిక్వెస్ట్‌ చేశా. పదో తేదీని నా సినిమానే మాట్లాడుతుంది. ఆ తర్వాత మేము మాట్లాడతాం’ అని అన్నారు.

Updated Date - Jul 06 , 2026 | 03:20 PM