సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అఖిల్‌ను చూస్తే ‘సత్యం’ నాటి నా పరిస్థితే గుర్తుకొచ్చింది: సుమంత్

ABN, Publish Date - Jul 27 , 2026 | 08:22 PM

అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని సినీ ప్రయాణం, ఆయన సాధించిన విజయంపై వర్సటైల్ యాక్టర్ సుమంత్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

Sumanth about Lenin Success

అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని (Akhil Akkineni) సినీ ప్రయాణం, ఆయన సాధించిన విజయంపై వర్సటైల్ యాక్టర్ సుమంత్ (Sumanth) తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, ‘లెనిన్’ (Lenin)తో అఖిల్ సాధించిన సక్సెస్ చూసి తనకు కళ్లెంబట నీళ్లు తిరిగాయని.. చాలా కాలం తర్వాత ఎంతో ఉపశమనం, ఆనందం కలిగిందని వెల్లడించారు. అఖిల్ విజయాన్ని చూసినప్పుడు తనకు తన కెరీర్‌లోని బ్లాక్‌బస్టర్ హిట్ ‘సత్యం’ (Satyam) చిత్రం నాటి రోజులు గుర్తుకొచ్చాయని సుమంత్ ఈ సందర్భంగా పంచుకున్నారు.


సుమంత్ మాట్లాడుతూ.. ‘‘అఖిల్ విషయంలో చినమామయ్య (నాగార్జున కింగ్) కాంట్రిబ్యూషన్, ఎంత బాధ్యత ఉందో నాకు బాగా తెలుసు. ‘లెనిన్’ సక్సెస్ అయినప్పుడు నాకు నా సినిమా ‘సత్యం’ గుర్తుకు వచ్చింది. అప్పుడు కూడా నా సినిమాలు ఓ మాదిరిగా ఆడాయి, కొన్ని ఫ్లాప్ అయ్యాయి. నాలుగేళ్ల తర్వాత నాకు ‘సత్యం’ రూపంలో మొదటి బ్లాక్‌బస్టర్ లభించింది. ఇప్పుడు ‘లెనిన్’కి ఎలా అయితే చినమాయయ్య చేశారో.. అప్పుడు ‘సత్యం’ సినిమాకు కూడా అలాగే చేశారు. దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. కథకు మార్పులు చేసి, కరెక్ట్‌గా వచ్చే వరకు అన్నీ మామయ్యే చూసుకున్నారు. ఇప్పుడు అఖిల్ కోసం కూడా అంతే కష్టపడ్డారు.


ఒకప్పుడు నా గురించి కూడా ‘అందంగా ఉంటాడు, టాలెంట్ ఉంది కానీ సరిగ్గా బ్రేక్ రావట్లేదు’ అనే కామెంట్లు వచ్చేవి. అఖిల్ విషయంలో కూడా మాకు అలానే అనిపించేంది. మా కుటుంబంలో అందరి కంటే అఖిల్ అద్భుతంగా డాన్స్ చేస్తాడు, ఫైట్స్ బాగా చేస్తాడు, చాలా గుడ్‌ లుకింగ్, టాలెంట్ ఉన్న నటుడు. అఖిల్‌కు కావలసిందల్లా కేవలం ఒక సరైన ప్లాట్‌ఫామ్ మాత్రమే. ‘లెనిన్’ తనకి ఆ ప్లాట్‌ఫామ్‌ని ఇచ్చింది. తన సమయం వచ్చినప్పుడు తన ప్రతిభ ఏంటో నిరూపించుకున్నాడు’’ అంటూ అఖిల్‌పై తనకున్న ప్రేమాభిమానాలను సుమంత్ ఎమోషనల్‌గా వ్యక్తపరిచారు. ప్రస్తుతం సుమంత్ చేసిన ఈ వ్యాఖ్యలు అక్కినేని అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి:

బాలయ్య లేకుండానే షూటింగ్.. కొరటాల ప్లానేంటి?

యాక్టింగ్‌లోకి దిగిన దర్శకుడు.. ‘అనకాపల్లి’ ట్రైలర్ ఎలా ఉందంటే

అనిల్ రావిపూడి కోసం నిర్మాతలు క్యూ.. ‘పెద్ది’ సారూ?

Updated Date - Jul 27 , 2026 | 08:22 PM