సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Akhil Akkineni: నన్ను క్షమించండి.. అఖిల్ ఎమోషనల్ స్పీచ్

ABN, Publish Date - Jun 30 , 2026 | 09:36 PM

అక్కినేని అఖిల్ (Akhil Akkineni).. ఎన్నో ఏళ్లుగా ఒక విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. మూడేళ్ళ క్రితం ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Akhil Akkineni

అక్కినేని అఖిల్ (Akhil Akkineni).. ఎన్నో ఏళ్లుగా ఒక విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. మూడేళ్ళ క్రితం ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఏ రేంజ్ లో డిజాస్టర్ అయ్యిందో అందరికీ తెల్సిందే. ఇక ఎలాగైనా మంచి హిట్ కొట్టాలని అఖిల్ పకడ్బందీగా ప్లాన్ చేసి మొదలుపెట్టిన సినిమా లెనిన్ (Lenin). మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు.. సినిమాపై మంచి హైప్ ని క్రియేట్ చేసాయి.


తాజాగా లెనిన్ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అఖిల్.. అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. మూడేళ్ళుగా వెండితెరపై అలరించలేకపోయాను అంటూ చెప్పుకొచ్చాడు. కచ్చితంగా లెనిన్ పెద్ద హిట్ అవుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఈసారి సినిమానే మాట్లాడుతోందని చెప్పాడు.


'ఇవాళ మనం ఎక్కువ మాట్లాడకూడదు. నేనైతే ఎక్కువ మాట్లాడకూడదు. సినిమా రిలీజ్ తరువాత మాట్లాడాలి. నేను కాదు, సినిమా మాట్లాడుతది ఈసారి.. ఇంతకన్నా నేను మాట్లాడకూడదు. రెండు రోజుల నుంచి పడుకోలేదు. అందుకే ఈ కళ్లద్దాలు వేసుకొని వద్దాం అనుకున్నాను. కానీ, మిమ్మల్ని చూసి నాకు ఎనర్జీ వచ్చింది. నెక్స్ట్ జులై 10 వరకు పని చేయడానికి మళ్లీ నాకు ఎనర్జీ ఇచ్చారు . నేను హ్యాపీగా, మనస్ఫూర్తిగా ఒక ఆక్సిజన్ పీల్చినట్టు ఫీల్ అవుతున్నాను మిమ్మల్ని చూసి.. సారీ బ్రదర్, సారీ.. త్రీ ఇయర్స్ అయింది వచ్చి. క్షమించండి. మనస్ఫూర్తిగా గుండె పైన చెయ్యి పెట్టి చెప్తున్నాను.. నమ్మండి ఈసారి..' అంటూ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం అఖిల్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Updated Date - Jun 30 , 2026 | 09:52 PM