అఖిల్ సినిమాపై సమంత క్రేజీ రివ్యూ..
ABN, Publish Date - Jul 10 , 2026 | 03:54 PM
సినిమా పరిశ్రమలో హెల్తీ రిలేషన్స్, పరస్పర గౌరవం ఎంత అందంగా ఉంటాయో అక్కినేని అఖిల్ (Akkineni Akhil), సమంత (Samantha) మరోసారి నిరూపించారు. వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి, ఒకరి పనిని ఒకరు గౌరవించుకుంటూ ప్రొఫెషనల్‌గా వారు ప్రవర్తిస్తున్న తీరు పరిశ్రమలో సరికొత్త చర్చకు దారితీసింది.
సినిమా పరిశ్రమలో హెల్తీ రిలేషన్స్, పరస్పర గౌరవం ఎంత అందంగా ఉంటాయో అక్కినేని అఖిల్ (Akkineni Akhil), సమంత (Samantha) మరోసారి నిరూపించారు. వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి, ఒకరి పనిని ఒకరు గౌరవించుకుంటూ ప్రొఫెషనల్‌గా వారు ప్రవర్తిస్తున్న తీరు పరిశ్రమలో సరికొత్త చర్చకు దారితీసింది. అక్కినేని నాగచైతన్యతో సమంత వివాహం జరిగిన దగ్గరనుంచి.. సామ్ బెస్ట్ ఫ్రెండ్ అంటే అఖిల్ అనే చెప్పాలి. ఎక్కడకు వెళ్ళినా ఈ వదినామరిదులే హైలైట్ గా కనిపించేవారు. సాధారణంగా అన్నతో వదిన విడిపోతే.. ఆ కుటుంబానికి.. ఈ కుటుంబానికి మధ్య సంబంధం తెగిపోయినట్టే. కానీ, ఇక్కడ సామ్ - చై విడిపోయినా.. అఖిల్ - సామ్ మధ్య ఉన్న బాండ్ మాత్రం అస్సలు తగ్గలేదు. అందుకు ఉదాహరణే.. లెనిన్ సినిమా ప్రమోషన్స్‌లో అఖిల్.. సమంత రీసెంట్ సక్సెస్ మా ఇంటి బంగారం చిత్రం గురించి, అందులో ఆమె నటన గురించి చాలా హుందాగా, గొప్పగా మాట్లాడటం. ఇక ఇప్పుడు సామ్ సైతం మాజీ మరిది అఖిల్ సినిమాకు ఆమె బెస్ట్ విషెస్ చెప్పడం.. ప్రస్తుతం వీరిద్దరి గురించే సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది.
మొన్న అఖిల్ చూపించిన హుందాతనానికి సమంత అంతే మెచ్యూర్డ్‌గా స్పందించింది. అఖిల్ హీరోగా నటించిన లెనిన్ చిత్ర ట్రైలర్‌ను ఆమె తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేయడమే కాకుండా ఈ ట్రైలర్ చూస్తుంటే ఆల్రెడీ బిగ్ బ్లాక్‌బస్టర్ వైబ్స్ కనిపిస్తున్నాయంటూ అఖిల్‌కు, లెనిన్ చిత్రబృందానికి మనస్ఫూర్తిగా బెస్ట్ విషెస్ తెలిపింది. ' లెనిన్ చిత్రబృందానికి మనస్ఫూర్తిగా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను.. ఇప్పటికే బ్లాక్ బస్టర్ అని టాక్ నడుస్తోంది' అని రాసుకొచ్చింది.
ఇక రెండు కుటుంబాలు విడిపోయినా కూడా ఇలా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్న వీరిద్దరి మెచ్యూర్డ్ గెస్ట్యూర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. గతాన్ని పక్కన పెట్టి ఇద్దరూ ఇంత పాజిటివ్‌గా ఒకరినొకరు అభినందించుకోవడం చూసి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిజమైన క్లాస్, మెచ్యూరిటీ అంటే ఇదే అంటూ అటు అక్కినేని ఫ్యాన్స్, ఇటు సమంత ఫ్యాన్స్ ఇద్దరూ సోషల్ మీడియాలో ఈ మూమెంట్‌ను తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇక దీంతో ఇంకే సమంతనే లెనిన్ కి రివ్యూ ఇచ్చింది అంటే సినిమా రికార్డుల వేట మొదలుపెట్టినట్టే అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.