సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సమంత 'మా ఇంటి బంగారం'పై.. అఖిల్ ప్రశంసల వర్షం!

ABN, Publish Date - Jul 03 , 2026 | 11:26 AM

అఖిల్.. స్టార్ హీరోయిన్ సమంత మా ఇంటి బంగారం చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

akhil samantha

అక్కినేని అఖిల్ (Akhil) త్వరలోనే 'లెనిన్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో, భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా తెరకెక్కిన ఈ భారీ చిత్రం జులై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ వేగాన్ని పెంచింది. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అఖిల్.. స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram) చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా ట్రైలర్ తనకు ఎంతో నచ్చిందని, అందులోని వైబ్ అద్భుతంగా ఉందంటూ ఆయన కొనియాడారు. ముఖ్యంగా ఈ చిత్రంలో సమంత చేసిన యాక్షన్ సన్నివేశాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెబుతూ, చిత్ర బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

టాలెంటెడ్ డైరెక్టర్ నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. జూన్ 19న విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు దాదాపు రూ. 82 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. లాంగ్ రన్‌లో రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు బలంగా అంచనా వేస్తున్నాయి. సమంత పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌కు తోడు నందినీ రెడ్డి మార్క్ మేకింగ్ తోడవడంతో ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. ఇలాంటి తరుణంలో అఖిల్ ఈ చిత్రంపై పాజిటివ్ కామెంట్స్ చేయడం సినిమా మైలేజ్‌ను మరింత పెంచిందని చెప్పవచ్చు.

అఖిల్ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, అక్కినేని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో అఖిల్ అన్నయ్య నాగ చైతన్య, సమంత ప్రేమించి 2017 అక్టోబర్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ జంట 2021 అక్టోబర్‌లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి విడిపోయారు. తమ కుటుంబం నుండి విడిపోయినప్పటికీ, సమంత సాధించిన విజయాన్ని మనస్ఫూర్తిగా అభినందించడం అఖిల్ సంస్కారానికి, ఆయనకున్న మంచి మనసుకు నిదర్శనమంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. వ్యక్తిగత బంధాలు ఎలా ఉన్నా, ఒక నటిగా ఆమె ప్రతిభను గౌరవించి అఖిల్ సపోర్ట్ చేయడం నిజంగా గ్రేట్ అంటూ ప్రశంసిస్తున్నారు.

Updated Date - Jul 03 , 2026 | 12:38 PM