సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Akhil Akkineni: ఆ మాట అంటే చరణ్ కొడతాడు

ABN, Publish Date - Jul 03 , 2026 | 09:08 PM

అక్కినేని అఖిల్ (Akkineni Akhil) త్వరలోనే లెనిన్ (Lenin చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దాదాపు మూడేళ్ళ తరువాత అఖిల వెండితెరపై కనిపించనున్నాడు.

Akhil- Charan

అక్కినేని అఖిల్ (Akkineni Akhil) త్వరలోనే లెనిన్ (Lenin చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దాదాపు మూడేళ్ళ తరువాత అఖిల వెండితెరపై కనిపించనున్నాడు. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో, భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా తెరకెక్కిన ఈ భారీ చిత్రం జులై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ వేగాన్ని పెంచింది. వరుస ఇంటర్వ్యూలతో సోషల్ మీడియా మొత్తం అఖిల్ నే కనిపిస్తున్నాడు. సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను, అభిప్రాయాలను పంచుకుంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అఖిల్.. పెద్ది సినిమాపై ప్రశంసలు కురిపించాడు.


రామ్ చరణ్, అఖిల్ కి మధ్య మంచి అనుబంధం ఉంది. చరణ్ కి అక్కాచెల్లెలు ఉన్నారు కానీ, తమ్ముడు లేడు. చిన్నప్పటి నుంచి చరణ్.. అఖిల్ ని తన చిన్న తమ్ముడిగా అనుకుంటాడు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు చరణ్- అఖిల్ ఇద్దరూ చెప్పుకొచ్చారు. ఇక ఈమధ్యనే రిలీజ్ అయిన పెద్ది సినిమాపై అఖిల్ స్పందించాడు. పెద్దిలో చరణ్ అస్సలు కనిపించలేదని, ఫ్రేమ్ టూ ఫ్రేమ్ పెద్దినే కనిపించాడని తెలిపాడు. ఆ పాత్రలో చరణ్ జీవించేశాడు అని అన్నాడు. ఇక చరణ్ గురించి చెప్పేటప్పుడు గారు అని గౌరవం ఇవ్వడంతో.. అలా పిలిస్తే తనను కొడతాడు అని చెప్పి వారిమధ్య ఉన్న బంధం ఎంత గట్టిదో వివరించాడు.


'పెద్ది సినిమా చూశాను. అసలు ఏం నటించాడు.. చాలా అంటే చాలా బాగా నటించాడు. అసలు చరణ్ గారు ఆ పాత్రలో జీవించారు. రామ్ చరణ్ గారు కనిపించలేదు. గారు అంటే కొడతాడు నన్ను. ఒక్క ఫ్రేమ్ లో కూడా చరణ్ కనిపించలేదు. నేను కేవలం పెద్దినే చూశాను. ఆయన నిజమైన స్టార్. అలాంటి స్టార్స్.. పాత్రల్లో పరకాయప్రవేశం చేస్తారు' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మూడేళ్ళ తరువాత వస్తోన్న లెనిన్ తో అయ్యగారు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Jul 03 , 2026 | 09:12 PM