సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

వాస్తవ సంఘటనలతో ఐశ్వర్య రాజేష్‌ కొత్త సినిమా 

ABN, Publish Date - Feb 21 , 2026 | 08:36 AM

ఐశ్వర్య రాజేష్‌ (Aishwarya Rajesh) ప్రధాన పాత్రలో ‘అండర్‌-18’ (under 18) చిత్రం తెరకెక్కుతోంది.

ఐశ్వర్య రాజేష్‌ (Aishwarya Rajesh) ప్రధాన పాత్రలో ‘అండర్‌-18’ (under 18) చిత్రం తెరకెక్కుతోంది. ఇది 18 ఏళ్ళ లోపు యువత కథతో తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్‌ (vetrimaran) రిలీజ్‌ చేశారు. ఆయన  వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన కార్తీక్‌ పెరుమాల్‌సామి ఈ చిత్రానికి దర్శకత్వం  వహిస్తున్నారు. ఎస్‌ఆర్‌ ప్రొడక్షన్‌ పతాకంపై జగదీష్‌ నిర్మిస్తున్నారు. ఇందులో ఐశ్వర్య రాజేష్‌ సోలో హీరోయిన్‌గా నటిస్తుండగా, విక్రాంత్‌ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.

ఈ సినిమా గురించి దర్శకుడు మాట్లాడుతూ, ‘నేర ప్రపంచంలో ఒక క్రూరమైన ముఖం, దాని బారినపడిన ఒక కుటుంబ భావాలతో ఎమోషనల్‌ డ్రామాగా తెరకెక్కిస్తున్నాం. రాష్ట్రంలో వెలుగు చూడని నేర నేపథ్యాలను వ్యక్తిగతంగా పరిశోధించి, నిజమైన సంఘటనల ప్రభావంతో ఈ చిత్రాన్ని భావోద్వేగ కథగా రూపొందిస్తున్నాం. సామాజిక వాస్తవికత, కుటుంబ భావాల మిశ్రమంగా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నాం' అని అన్నారు. 

Updated Date - Feb 21 , 2026 | 11:43 AM