Aishwarya Rajesh: వెబ్ సీరిస్, సినిమా ఒకదాని వెనుక ఒకటి!

ABN , Publish Date - Jul 01 , 2026 | 02:54 PM

'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో గ్రాండ్‌ విక్టరీ అందుకున్న ఐశ్వర్య రాజేశ్‌ తెలుగు స్ట్రయిట్‌ తెలుగు ప్రాజెక్ట్స్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ జనం ముందుకు వస్తున్నాయి. అందులో 'ఇసాక పట్నం' వెబ్ సీరిస్ కాగా, 'ఓ సుకుమారి' ఫీచర్ ఫిల్మ్!

Aishwarya Rajesh

ఐశ్వర్య రాజేశ్‌ నటించిన సూపర్ హిట్‌ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం' గత యేడాది సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది. ఆ తర్వాత ఆమె నటించిన తెలుగు స్ట్రయిట్‌ మూవీ ఏదీ ఇంతవరకూ రిలీజ్ కాలేదు. అయితే గత యేడాది నవంబర్ లోనే అర్జున్ తో కలిసి ఐశ్వర్య రాజేశ్‌ నటించిన తమిళ చిత్రం ఒకటి 'మఫ్టీ పోలీస్‌'పేరుతో తెలుగులో డబ్ అయ్యింది. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు.

ఇప్పుడు మాత్రం ఐశ్వర్య రాజేశ్‌ నటించిన రెండు ప్రాజెక్ట్స్ తెలుగులో ఒక దాని వెనుక వస్తున్నాయి. సముతిరకనితో కలిసి ఐశ్వర్య రాజేశ్‌ నటించిన వెబ్ సీరిస్ 'ఇసాక పట్నం' ఈ నెల 2 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్‌ కాబోతోంది. ఇందులో వీరిద్దరూ తండ్రీ కూతుళ్ళుగా నటిస్తున్నారు. అయితే తండ్రి ఆధిపత్యాన్ని ఎదురించే కూతురుగా ఐశ్వర్య రాజేశ్‌ కీలక పాత్ర పోషిస్తోంది. సునీల్‌, నరేశ్‌ అగస్త్య, మెరిన్ ఫిలిప్, సుధాకర్ కోమాకుల, రాజీవ్ కనకాల, మైమ్ గోపీ, రోహిణి, బెనర్జీ, రాజా చేంబోలు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో రాహుల్ తమడా, సైదీప్ రెడ్డి బొర్రా దీనిని నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అయ్యే ఈ వెబ్ సీరిస్ ఏడు ఎపిసోడ్స్ ఉండబోతోంది.


Release Date poster PLAIN.jpg

ఇదిలా ఉంటే... జూలై 17న ఐశ్వర్య రాజేశ్‌ హీరోయిన్ గా నటించిన 'ఓ సుకుమారి' మూవీ రిలీజ్ కానుంది. తిరువీర్ హీరోగా నటించిన ఈ సినిమాను భరత్‌ దర్శన్ దర్శకత్వంలో మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్‌లో హీరో, హీరోయిన్ ఒకరినొకరు తాకబోతున్న క్షణాన్ని మెరుపులతో విజువల్‌గా చూపించిన తీరు సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచుతోంది. ఈ చిత్రానికి ఎం. ఎం. కీరవాణి శిష్యుడు భరత్‌ మంచిరాజు సంగీతం అందిస్తున్నారు. విశేషం ఏమంటే ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా ఐశ్వర్య రాజేశ్‌ నటించిన ఓ వెబ్ సీరిస్, సినిమా బ్యాక్ టు బ్యాక్ వస్తుండటం విశేషమే!

ఇవి కూడా చదవండి:

Akhil Akkineni: నన్ను క్షమించండి.. అఖిల్ ఎమోషనల్ స్పీచ్

హీరో అఖిల్ రాజ్ ఇంటిపై.. దాడికి డెలివరీ బాయ్స్ యత్నం! పోలీస్ స్టేషన్ వద్ద హంగామా

Updated Date - Jul 01 , 2026 | 03:10 PM