సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Isakapatnam Trailer 2: చంపక్కర్లేదు.. చంపేంత పని చేస్తే చాలు..

ABN, Publish Date - Jun 26 , 2026 | 04:34 PM

‘ఇసకపట్నం’ (Isakapatnam) సిరీస్‌ టైటిల్‌ ప్రకటించినప్పటి నుంచీ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తింది. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్‌లో సముద్రఖని నాయుడు పాత్రలో, ఐశ్వర్య రాజేష్‌ (Aishwarya Rajesh) భారతి పాత్రలో నటించారు.

‘ఇసకపట్నం’ (Isakapatnam) సిరీస్‌ టైటిల్‌ ప్రకటించినప్పటి నుంచీ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తింది. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్‌లో సముద్రఖని నాయుడు పాత్రలో, ఐశ్వర్య రాజేష్‌ (Aishwarya Rajesh) భారతి పాత్రలో నటించారు. పట్టణంలో రాజకీయాలు, నేరాలు, వ్యాపారాలపై ఆదిపత్యం చెలాయించే నాయుడికి, తన సొంత కూతురే పెద్ద సవాల్‌గా మారి, తండ్రికి ఎదురు నిలబడే ఉత్కంఠభరిత కథతో ఈ సిరీస్‌ తెరకెక్కింది. ఏడు ఎపిసోడ్లుగా రూపొందిన సిరీస్‌కు ప్రశాంత్‌ రాఘతి కథ అందించగా, తాజుద్దీన్‌ సయ్యద్‌ సంభాషణలు అందించారు.

శుక్రవారం దీనికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. సునీల్‌, నరేష్‌ అగస్త్య, మెరిన్‌ ఫిలిప్‌, సుధాకర్‌ కోమాకుల, రాజీవ్‌ కనకాల, మైమ్‌ గోపీ, రోహిణి, బెనర్జీ, జ్వాల కోటి, రవి వర్మ, రాజా చెంబోలు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా జూలై 2 నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్ర్టీమింగ్‌ కానుంది. అలాగే మరో 15 భాషల్లో సబ్‌టైటిల్స్‌తో ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా 240కు పైగా దేశాల్లో అందుబాటులోకి రానుంది.

Updated Date - Jun 26 , 2026 | 05:04 PM