మళ్లీనా.. 'విశ్వంభర' రీ షూట్! చిరు.. ఈ సారి టైమ్ ఇస్తారా?
ABN, Publish Date - Jul 01 , 2026 | 11:31 AM
మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా ఏ ముహుర్తాన మొదలుపెట్టారో కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక ఇబ్బంది తలెత్తుతూనే ఉంది.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) విశ్వంభర (Viswambhara) సినిమా ఏ ముహుర్తాన మొదలుపెట్టారో కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక ఇబ్బంది తలెత్తుతూనే ఉంది. ఈ సినిమా మొదలై దాదాపు మూడేళ్లు దాటిపోయింది. ఇంత కాలం గడిచినా, సినిమా రిలీజ్ డేట్‌పై ఇంకా సస్పెన్స్ వీడకపోవడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో కూడా చెప్పలేని పరిస్థితికి వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో మరింత నెగిటివ్‌గా మారుతున్నాయి.
విశ్వంభర సినిమా కోసం విజువల్ ఎఫెక్ట్స్ అత్యంత కీలకం. గతం లో వచ్చిన గ్లింప్స్‌పై కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో, యూవీ క్రియేషన్స్ అస్సలు రిస్క్ తీసుకోవద్దని నిర్ణయించుకున్నారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతో, పోస్ట్ ప్రొడక్షన్ పనులను దాదాపు ఏడాదిన్నరగా పకడ్బందీగా చేస్తున్నారు. మెగాస్టార్ స్వయంగా 2026 సమ్మర్‌లో సినిమా విడుదలవుతుందని ప్రామిస్ చేసినా, సాంకేతిక కారణాల వల్ల అది సాధ్యపడలేదు. గతేడాది మౌనీ రాయ్‌తో స్పెషల్ సాంగ్, కీలక సన్నివేశాలను పూర్తి చేసి షూటింగ్ ప్యాకప్ చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు మళ్ళీ కొత్త చర్చ మొదలైంది.
తాజా సమాచారం ప్రకారం, సినిమా అవుట్‌పుట్‌ను ఇంకా మెరుగుపరిచేందుకు కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేయాలని మూవీ యూనిట్ భావిస్తోందట. ఒకవైపు బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతున్న మెగా 158 కోసం మెగాస్టార్ భారీ కసరత్తులు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి బరిలో దించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి బిజీ షెడ్యూల్స్ మధ్యలో, ఇప్పటికే పూర్తయిన విశ్వంభర కోసం మళ్ళీ డేట్స్ కేటాయించడం చిరంజీవి గారికి ఎంతవరకు సాధ్యం..? ఆ రీ-షూట్‌కి ఆయన ఎలా స్పందిస్తారు..? అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఈ ప్రాజెక్ట్ కోసం చిరంజీవి గారు పెడుతున్న కృషి, తీసుకుంటున్న శ్రద్ధ మాటల్లో చెప్పలేం.
విశ్వంభర బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. అయితే, అభిమానులు మాత్రం ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆత్రుతగా వేచి చూస్తున్నారు. ఈ ఏడాదైనా సినిమాకు సంబంధించిన పనులన్నీ కంప్లీట్ చేసి, ఫ్యాన్స్‌కు భారీ గిఫ్ట్ ఇస్తారా లేదా అనేది చూడాలి. చిరంజీవి గారు ఎప్పుడూ తన అభిమానులను నిరాశపరచరు కాబట్టి, ఈ సినిమా విషయంలో కూడా త్వరలోనే ఒక క్లారిటీ వస్తుందని ఆశిద్దాం.