మరోసారి.. బుచ్చిబాబుతో రామ్ చరణ్! ఈసారి.. ఏం కట్ చేస్తాడో?
ABN, Publish Date - Jul 02 , 2026 | 08:26 AM
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్-బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వచ్చిన పెద్ది (Peddi) సినిమా గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)-బుచ్చిబాబు సన (Buchi Babu Sana) కాంబినేషన్‌లో వచ్చిన పెద్ది (Peddi) సినిమా గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా కోసం చరణ్ పడిన కష్టం, ఆయన చూపించిన డెడికేషన్ అంతా ఇంతా కాదు. ఫిజికల్లీ కూడా చాలా మార్పులు చేసుకున్నారు. త్రిబుల్ ఆర్ తర్వాత వచ్చిన ఆచార్య, గేమ్ ఛేంజర్ ఫలితాలతో కొంచెం నిరాశ చెందిన ఫ్యాన్స్‌కు పెద్ది ఒక రేంజ్ బూస్టప్‌ని ఇచ్చింది. థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ ఉన్నా, బాక్సాఫీస్ దగ్గర 400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టడం అంటే మామూలు విషయం కాదు కదా. అయితే ఇప్పుడు మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్‌లో మరో మూవీ రాబోతుందని టాక్ వినిపిస్తుంది.
పెద్ది సినిమా థియేట్రికల్ రన్ ఆల్మోస్ట్ పూర్తయ్యింది. ఈ నెల 16 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కి కూడా రెడీ అవుతోంది. అయితే, ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే... ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక కొత్త వార్త తెగ చక్కర్లు కొడుతోంది. రామ్ చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయంలో సుకుమార్ గారితో చాలా బిజీగా ఉన్నారనే విషయం మనకు తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఆ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. కానీ, ఈ సినిమా తర్వాత మళ్లీ బుచ్చిబాబుతోనే చరణ్ మరో ప్రాజెక్ట్ చేయబోతున్నారనే టాక్ ఫిలింనగర్ సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తోంది. ముఖ్యంగా ఒక ప్రముఖ నిర్మాత ఇప్పటికే బుచ్చిబాబుకి అడ్వాన్స్ కూడా ఇచ్చారని, చరణ్ కూడా ఈ ఐడియాపై చాలా ఇంట్రెస్ట్‌గా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక అసలు విషయానికి వస్తే... బుచ్చిబాబు అంటేనే మేకింగ్‌లో ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంటుంది. స్క్రీన్‌పై ఎమోషన్స్ తెరకెక్కించే విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే బుచ్చిబాబు తన హీరోలకు సినిమాలో ఏదో ఒక పార్ట్ లేపేసే అలవాటు ఉండడంతో, ఈసారి బుచ్చిబాబు ఏం కటింగ్స్ చేస్తాడో అని అభిమానులు ఇప్పుడే చర్చించుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఒక పెద్ద కాంబో గురించి చర్చ జరుగుతోంది అంటే ఇలాంటి రూమర్స్, కామెంట్స్ రావడం సహజం. అయితే, ఇది కేవలం ఊహాగానమా లేక నిజంగానే చరణ్-బుచ్చిబాబు మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవుతుందా అనేది కాలమే నిర్ణయించాలి.