Anasuya Bharadwaj: అనసూయ వన్స్‌మోర్.. భర్తతో జలకాలాటలు, చుంబనాలు! ఫొటోలు వైరల్
ABN, Publish Date - Jan 01 , 2026 | 05:56 PM
ఇటీవల శివాజీ (Shivaji) హీరోయిన్ల డ్రెస్సింగ్ విషయంపై చేసిన వ్యాఖ్యలపై ఎంత రచ్చ నడిచిందో తెలిసిందే.
ఇటీవల శివాజీ (Shivaji) హీరోయిన్ల డ్రెస్సింగ్ విషయంపై చేసిన వ్యాఖ్యలపై ఎంత రచ్చ నడిచిందో తెలిసిందే. ఈ నేపథ్యంలో అనసూయ, చిన్మయి, నాగబాబు (Nagababu), ప్రకాశ్ రాజ్ వంటి వారు ఎంట్రీ ఇవ్వడం వారి అభిప్రాయాలు చెప్పడంతో వివాదం మరింత జఠిలంగా మారింది. ముఖ్యంగా అనసూయ (Anasuya Bharadwaj) మా బాడీ. మా బట్టలు మా ఇష్టం వచ్చినట్లు వేసుకుంటాం అడగడానికి మీరెవరని కామెంట్లు చేసి అంతటిలో ఆగక బికినీలో ఉన్న పాత ఫొటోలను షేర్ చేయడం సమస్యను మరింత రెట్టిపు చేశాయి.
దాంతో శివాజీ వ్యాఖ్యల ఇష్యూ కాస్త అమె డ్రెస్సులపైకి మళ్లింది. గత నాలుగైదు రోజులుగా అనసూయను టార్గెట్ చేస్తూ అనేకమంది ప్రజలు ఓ రేంజ్‌లో తిట్లు, బూతులతో ట్రోలింగ్ చేస్తున్నారు. ఏ యూట్యూబ్ ఛానల్ చూసిన అనసూయపైనే డిబెట్లు పెడుతూ సమస్యను కంటిన్యూ చేస్తూనే ఉన్నాయి.
మరోపైవు సోషల్ మీడియాలో ఇంత జరుగుతున్నా అనసూయ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. నిత్యం ఏదో ఓ పోస్టు పెడుతూ తనపై కామెంట్లు చేస్తున్న వారిపై తన స్టైల్‌లో విరుచుకు పడుతుంది.
కాగా జనవరి 1 నూతన సంవత్సరం సందర్బంగా మరో సారి అనసూయ తన భర్తతో స్విమ్మింగ్ చేసే, ముద్దులాడే ఫొటోలు ఇన్‌స్టాలో షేర్ చేసి న్యూ ఇయన్ విషెష్ తెలిపింది. దీంతో శృతి తప్పిన నెటిజన్లు తమ చేతులకు, నోటికి పని చెబుతూ చెలరేగి పోతున్నారు.
ప్రస్తుతం అనసూయ తన భర్తతో కలిసి జలకాలాటలు అడే చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అంతకుమించి ట్రోల్స్ జరుగుతున్నాయి. పరిస్థితి చూస్తంఉటే ఈ వారం కూడా అనసూయ అంశంపై ట్రెండింగ్‌లో ఉండనున్నట్లు తెలుస్తోంది.