ఈ టీజర్ చూసి.. పేరెంట్స్ తట్టుకోగలరా! మరీ ఇంత పచ్చిగా.. తీశారేంటి
ABN, Publish Date - Feb 12 , 2026 | 09:30 PM
అన్షు, వాసవి గణేశన్ జంటగా తెరకెక్కిన కొత్త చిత్రం హుషారు పిట్టలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అయింది.
అన్షు (Anshu), వాసవి గణేశన్ (Vasavi Ganeshan) జంటగా తెరకెక్కిన కొత్త చిత్రం హుషారు పిట్టలు (Hushar Pittalu). బిక్షు (Bikshu) దర్శకత్వం వహించిన ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అయింది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ ఏషియన్ సురేష్ (Asian Suresh) ఫిలింస్ ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా గురువారం ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఇది చూసిన వారంతా షాక్ అవుతున్నారు.
ఈ చిత్రం టీజర్ చూస్తే.. యూత్‌ను టార్గెట్ చేస్తూ రూపొందించినట్లు అర్థమవుతోంది. నేటి జన్ జీ యూత్ టైంలో స్కూళ్లకు వెళుతున్న పిల్లలు, కాలేజీ కుర్రాళ్ల మనస్థత్వాలు, వారి ప్రయారిటీలు ఎలా ఉంటున్నాయి, తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, ఎలాంటి విపరీతాలు జరుగుతున్నాయనే నిజ జీవిత ఘటనలతో పచ్చిగా ఎక్కడా తగ్గకుండా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియా జమానాలో మగ, ఆడ అనే తేడా లేకుండా యూత్ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, వారు పేరెంట్స్‌కు చెప్పేదేంటి, చేసేదేంటి వంటి సన్నివేశాలు నేటి సమాజ స్థితిగతులను కళ్లకు కట్టినట్లు చూపించినట్లుగా ఉన్నాయి.
అంతేగాక.. ఇప్పటి పిల్లలు కామాన్ని కడుపులో ఉన్నప్పుడే నేర్చుకోని వచ్చినట్లు ఉంది వంటి డైలాగులు పరిస్థితి తీవ్రతను షార్ట్‌కట్‌లో చెప్పినట్లుగా ఉంది. ఇలాంటి మరెన్నో రీసెంట్ రియల్ ఇన్సిడెంట్లను టచ్ చేసినట్లు ఈ టీజర్ చూస్తే అర్తమవుతుంది. అయితే.. ఈ టీజర్‌ను చూసి యూత్ అందులోని సన్నివేశాలను తమకు ఆపాదించుకుని ఎంజాయ్ చేసి వైరల్ చేస్తారు. కానీ తల్లిదండ్రులు ఈ టీజర్ చూసి తట్టుకోగలరా, ప్రాణాలతో ఉండగలరా అనే ప్రశ్నలు తలెత్తక మానదు. పేరెంట్స్‌కు ఓ పీడకలగా ఉంటుందనడంలో సంకోచం లేదు.