వారణాసి తరువాత మహేష్ అతనితోనే.. పక్కా
ABN, Publish Date - Oct 09 , 2026 | 09:13 PM
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ మోస్ట్ అవెయిటెడ్ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ కోసం ప్రపంచం మొత్తం ఎదరుచూస్తోంది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వారణాసి (Varanasi) సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ మోస్ట్ అవెయిటెడ్ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ కోసం ప్రపంచం మొత్తం ఎదరుచూస్తోంది. ఇక ఈ మధ్యనే మహేశ్ బాబు తన పార్ట్‌ను విజయవంతంగా పూర్తి చేశాడు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కానుంది. వారణాసి వంటి విజువల్ వండర్ తర్వాత మహేశ్‌బాబు చేయబోయే తదుపరి చిత్రం ఏంటి? ఏ దర్శకుడితో ఆయన జతకట్టబోతున్నాడు? అని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది.
తాజా సమాచారం ప్రకారం, మహేశ్‌బాబు తన తదుపరి సినిమా కోసం లెక్కల మాస్టారు సుకుమార్ తో చేతులు కలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన 1 నేనొక్కడినే ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఎప్పటి నుంచో సుకుమార్ తనను నమ్మిన మహేశ్ కి ఒక మంచి హిట్ ఇవ్వాలని కలలు కంటూనే ఉన్నాడు. ఇక ఇప్పుడు ఈ కాంబో మళ్ళీ రిపీట్ అవుతోందని టాక్. ఇదే కనుక నిజం అయితే బాక్సాఫీస్ వద్ద రికార్డులు ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు సాగుతున్నాయని, అన్నీ కుదిరితే 2027లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశముందని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
కేవలం సుకుమార్ మాత్రమే కాకుండా మహేశ్ తో సినిమా తీసే డైరెక్టర్ లిస్ట్ లో యానిమల్' ఫేమ్ సందీప్ రెడ్డి వంగా, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టరు లోకేష్ కనకరాజ్పేర్లు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురు పవర్‌ఫుల్ డైరెక్టర్లతోనూ చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అయితే సుకుమార్ మాత్రం పక్కా అని అంటున్నారు. మరి రాజమౌళి తో భారీ ప్రాజెక్ట్ తర్వాత మహేష్ బాబు ఏ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో చూడాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు.