సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Buchi Babu Sana: 'పెద్ది' తర్వాత బుచ్చిబాబు సినిమా ఆ హీరోతోనేనా

ABN, Publish Date - May 02 , 2026 | 03:35 PM

బుచ్చిబాబు తన తదుపరి ప్రాజెక్ట్‌ను కూడా పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల ఆయన నెక్స్ట్ సినిమా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ఉంటుందని జోరుగా ప్రచారం సాగింది.

లెక్కల మాస్టర్ సుకుమార్ (sukumar) స్కూల్ నుండి వచ్చి మొదటి సినిమాతోనే బాక్సాఫీస్‌ను షేక్ చేసిన దర్శకుల్లో బుచ్చిబాబు సానా ఒకరు. 'ఉప్పెన' (Uppena) చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆయన, తొలి ప్రయత్నంలోనే దాదాపు రూ.100 కోట్ల క్లబ్‌లో చేరి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం టాలీవుడ్ కళ్ళన్నీ ఆయన తెరకెక్కిస్తున్న 'పెద్ది' (peddi) సినిమాపైనే ఉన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

ఈ భారీ బడ్జెట్ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటిస్తుండగా, శృతి హాసన్ ఒక ప్రత్యేక గీతంలో మెరవనుంది. వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'పెద్ది' సినిమా నుండి విడుదలైన రెండు పాటలు కూడా చార్ట్ బస్టర్స్ కావడంతో సినిమాపై పాజిటివ్ వైబ్స్ పెరిగాయి. జూన్ 4వ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రానికి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా, బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.



అదే కాన్ఫిడెన్స్‌తో బుచ్చిబాబు తన తదుపరి ప్రాజెక్ట్‌ను కూడా పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల ఆయన నెక్స్ట్ సినిమా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో ఉంటుందని జోరుగా ప్రచారం సాగింది. అయితే ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల, ఆయన కాల్షీట్లు దొరకడం ఇప్పట్లో కష్టమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుచ్చిబాబు తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారనే వార్త సినీ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది. 'వారణాసి' చిత్రం తర్వాత మహేష్ బాబు ఏ దర్శకుడితో పని చేస్తారనే విషయంలో ఇంకా అధికారిక ప్రక్రియ పూర్తి కాలేదు. అయితే మైత్రీ మూవీ మేకర్స్ వద్ద మహేష్ బాబు అడ్వాన్స్ ఉండటం, అదే సమయంలో బుచ్చిబాబును కూడా వారు అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేయడంతో ఈ క్రేజీ కాంబో సెట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో మహేష్ బాబు నటించిన '1 నేనొక్కడినే' సినిమాకు బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ అనుబంధం కూడా సినిమా పట్టాలెక్కడానికి దోహదం చేయవచ్చు.

మహేష్ బాబుతో సినిమా చేసే దర్శకుల జాబితాలో సందీప్ రెడ్డి వంగా, సుకుమార్ వంటి అగ్ర దర్శకుల పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో మహేష్ బాబు ఎవరి కథకు ముందుగా పచ్చజెండా ఊపుతారనేది ఆసక్తికరంగా మారింది. బుచ్చిబాబు తనదైన శైలిలో మహేష్ కోసం బలమైన కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. చాలా మందికి తెలిసిన విషయం ఏమిటంటే, బుచ్చిబాబు తన మేకింగ్ స్టైల్‌తో క్లాస్, మాస్ ఆడియన్స్‌ను మెప్పించగల సమర్థుడు. మరి ఈ స్టార్ దర్శకుల్లో మహేష్ ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో వేచి చూడాలి.

Updated Date - May 02 , 2026 | 03:41 PM