సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

శ్రీలీల.. మ‌రో నిరాశ‌! ఇక ఉంచినా.. ముంచినా ఆ సినిమానే

ABN, Publish Date - Mar 22 , 2026 | 10:50 AM

టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ, డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల (Sreeleela). ఇప్పుడు ఒక క్లిష్టమైన దశలో ఉంది.

sree leela

టాలీవుడ్ సెన్సేషనల్ బ్యూటీ, డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల (Sreeleela). ఇప్పుడు ఒక క్లిష్టమైన దశలో ఉంది. పెళ్లిసందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, తన ఎనర్జీతో కుర్రకారు గుండెల్లో గంటలు కొట్టించింది. మొదటి సినిమాతోనే తన సత్తా ఏంటో నిరూపించుకున్న ఈ భామ, ఆ తర్వాత వరుస అవకాశాలను అందుకుంటూ బిజీ హీరోయిన్ అయిపోయింది. అయితే, ఇప్పుడు ఆమె కెరీర్ గ్రాఫ్ చూస్తుంటే.. ఎక్కడో ఏదో తేడా కొడుతోందన్న భావన కలగక మానదు.

ప్రస్తుతం శ్రీలీల కెరీర్‌లో అత్యంత కీలకమైన సినిమాగా భావించిన ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) ఉగాది కానుకగా విడుదలైంది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)సరసన నటించే ఛాన్స్ అంటే మామూలు విషయం కాదు. ఈ సినిమాపై ఆమె చాలా ఆశలే పెట్టుకుంది. చిత్రంలో సెకండాఫ్‌లో ఎంట్రీ ఇచ్చినప్పటికీ, తన పెర్ఫామెన్స్‌తో, అదిరిపోయే స్టెప్పులతో ప్రేక్షకులను మెప్పించింది. కానీ, సినిమాకు మిశ్రమ స్పందన రావడం ఆమెకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది.

దీనితో పాటు, థియేటర్ల వద్ద ధురంధర్ చిత్రం ప్రభంజనం సృష్టిస్తుండడంతో, ఉస్తాద్‌ను పట్టించుకునే వారి సంఖ్య తగ్గిపోయింది. ఇది శ్రీలీలకు ఊహించని ఎదురుదెబ్బ అనే చెప్పాలి. తెలుగులో బిజీగా ఉంటూనే, పక్కనున్న తమిళ ఇండస్ట్రీపై కూడా కన్నేసింది ఈ సుందరి. ఈ ఏడాది పరాశక్తి అనే భారీ ప్రాజెక్టుతో కోలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. కోలీవుడ్‌లో పాగా వేయాలనుకున్న ఆమె కల ఈ సినిమా పరాజయంతో కాస్త మసకబారింది.

నటన పరంగా మార్కులు పడినా, కమర్షియల్ సక్సెస్ లేకపోవడం కెరీర్‌కు ఇబ్బందిగా మారింది. ఇక ఇప్పుడు శ్రీలీల ఆశలన్నీ బాలీవుడ్ సినిమా మీదనే ఉన్నాయి. ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan)తో కలిసి ఒక క్రేజీ ప్రాజెక్టులో నటిస్తోంది. హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తనను తాను మలుచుకుంటూ, ఈ సినిమాతో నార్త్ ఇండియాలో కూడా జెండా పాతాలని పట్టుదలతో ఉంది. కార్తీక్ ఆర్యన్ లాంటి స్టార్ హీరోతో చేస్తున్న ఈ సినిమా గనుక హిట్ అయితే, శ్రీలీల కెరీర్ మళ్ళీ పుంజుకుంటుంది.

నేషనల్ లెవల్‌లో గుర్తింపు లభిస్తే, సౌత్ సినిమాలకు కూడా అది పెద్ద ప్లస్ అవుతుంది. శ్రీలీల దగ్గర టాలెంట్ ఉంది, గ్లామర్ ఉంది, ఇంకా కష్టపడే తత్వం కూడా ఉంది. అయితే సినిమా పరిశ్రమలో లక్ అనేది కూడా చాలా ముఖ్యం. లోకానికి వెల్లడైన సత్యం ఏమిటంటే, సక్సెస్ ఉంటేనే ఇక్కడ మనుగడ సాధ్యం. వరుస పరాజయాలు పలకరిస్తున్నా, ఆమె తన ప్రయత్నాన్ని ఆపడం లేదు. కార్తీక్ ఆర్యన్ సినిమా ఆమె తలరాతను మారుస్తుందా? శ్రీలీల మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతుందా? అన్నది వేచి చూడాలి.

Updated Date - Mar 22 , 2026 | 11:24 AM