సొంతూరిలో విజయ్ దేవరకొండ.. అంబరాన్నంటిన సంబురాలు (Video)
ABN, Publish Date - Mar 02 , 2026 | 01:09 PM
విజయ్ దేవరకొండ, రష్మిక ఇటీవలే పెళ్లి అనంతరం తొలిసారిగా విజయ్ దేవరకొండ సొంత గ్రామం తుమ్మన్ పేటకు సోమవారం విచ్చేశారు.
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) రష్మిక (Rashmika Mandanna) ఇటీవలే పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ జంట పెళ్లి అనంతరం కలిసి తొలిసారిగా విజయ్ దేవరకొండ సొంత గ్రామం నాగర్ కర్నూలు (Nagarkurnool) జిల్లా బల్మూరు మండలం, తుమ్మన్ పేట (Thummanpet)కు సోమవారం విచ్చేశారు. ఈ సందర్భంగా అక్కడి గ్రామస్తులు ఈ నూతన వధూవరులకు తెలంగాణ సాంప్రదాయ పద్దతుల్లో డప్పు లు, వాయిద్యాలతో స్వాగతం తెలిపారు. పెద్దలు నూతన జంటకు దిష్టి తీసి, ఇంట్లోకి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా ఫామ్ హౌస్ లో నూతనంగా నిర్మించిన ఇంట్లోకి గృహ ప్రవేశం చేసి, సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. ఆపై అక్కడికి వచ్చిన వారికి విందు ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. ఇదిలాఉంటే బుధవారం, మార్చి 4న హైదరాబాద్ తాజ్ కృష్ణలో రిసెప్షన్ నిర్వహించ నుండగా దేశ విదేశాల నుంచి సినిమా, రాజకీయ ప్రముఖులు హజరు కానున్నారు.