సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బంగారం డైరెక్టర్.. బాగా గట్టిగా ప్లాన్ చేసినట్టుందే

ABN, Publish Date - Jul 08 , 2026 | 03:57 PM

టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్లు కొట్టి బాలీవుడ్ వైపు అడుగులు వేయడం ఈమధ్య మన దర్శకులకు ఒక ట్రెండ్‌గా మారింది. చాలామంది దర్శకులు ఇక్కడ సత్తా చాటి నార్త్ మార్కెట్‌ను షేక్ చేస్తుండగా.. ఇప్పుడు ఆ క్రేజీ లిస్ట్‌లోకి ప్రముఖ లేడీ డైరెక్టర్ బి.వి. నందిని రెడ్డి కూడా చేరడానికి సిద్దమైంది.

Nandini Reddy

టాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్లు కొట్టి బాలీవుడ్ వైపు అడుగులు వేయడం ఈమధ్య మన దర్శకులకు ఒక ట్రెండ్‌గా మారింది. చాలామంది దర్శకులు ఇక్కడ సత్తా చాటి నార్త్ మార్కెట్‌ను షేక్ చేస్తుండగా.. ఇప్పుడు ఆ క్రేజీ లిస్ట్‌లోకి ప్రముఖ లేడీ డైరెక్టర్ బి.వి. నందిని రెడ్డి కూడా చేరడానికి సిద్దమైంది. సమంత ప్రధాన పాత్రలో ఆమె తెరకెక్కించిన మా ఇంటి బంగారం చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. ఇక ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత నందిని రెడ్డి ప్లాన్ ఏంటి అంటే.. బాలీవుడ్ ఎంట్రీ అని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలపడం విశేషం.


త్వరలోనే తాను హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టబోతున్నట్లు నందిని రెడ్డి ఒక ఇంటర్వ్యూలోతెలిపింది.' మంచి కథ కుదిరితే ఖచ్చితంగా బాలీవుడ్ సినిమా చేస్తాను. ఏ భాషలో చెప్పినా కథ ఒకటే అనేది నా అభిప్రాయం. హిందీ నాకు కొత్త కాదు. నేను రెండేళ్ల పాటు ఢిల్లీలో చదువుకున్నాను. ఆ సమయంలో చాలా హిందీ సినిమాలు చూశాను' అని తెలిపింది. అంతేకాకుండా ఆమె బాలీవుడ్ ఎంట్రీ కంటే ముందే సినిమాలతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై కూడా ఒక సరికొత్త ప్రయోగానికి తెరలేపుతున్నట్లు చెప్పుకొచ్చింది.


ఇప్పటివరకు ఎక్కువగా లైట్ హార్టెడ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలు చేసిన నందిని రెడ్డి, ఈసారి రూట్ మార్చి ఓటీటీలో కాస్త భిన్నంగా ప్రయత్నించనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగానే త్వరలో ఒక డార్క్ సూపర్‌నేచురల్ వెబ్‌సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నానని, దీనికి సంబంధించిన షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభం కానుందని నందిని రెడ్డి చెప్పుకొచ్చింది. ఈ వెబ్‌సిరీస్ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఆమె తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. మరి నందిని రెడ్డి బాలీవుడ్ ఎంట్రీ ఏ స్టార్ తో ఉండబోతుందో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

Updated Date - Jul 08 , 2026 | 03:58 PM