మెగా ఫోన్ పట్టబోతున్న మరో యంగ్ హీరో..
ABN, Publish Date - Jul 26 , 2026 | 04:02 PM
ఈమధ్య టాలీవుడ్‌లో హీరోలు మెగాఫోన్ పట్టడం ఒక కొత్త ట్రెండ్‌గా మారిపోయింది. కేవలం కెమెరా ముందు నటనకే పరిమితం కాకుండా, తమ ఆలోచనలను స్క్రీన్ పైకి తీసుకురావడానికి హీరోలే స్వయంగా దర్శకులుగా మారుతున్నారు.
ఈమధ్య టాలీవుడ్‌లో హీరోలు మెగాఫోన్ పట్టడం ఒక కొత్త ట్రెండ్‌గా మారిపోయింది. కేవలం కెమెరా ముందు నటనకే పరిమితం కాకుండా, తమ ఆలోచనలను స్క్రీన్ పైకి తీసుకురావడానికి హీరోలే స్వయంగా దర్శకులుగా మారుతున్నారు. ఇప్పటికే విశ్వక్ సేన్ దర్శకుడిగా మారి మెప్పించాడు. ఇక యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని దర్శకులుగా మారి తమ ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కించి టాలీవుడ్‌ను ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు వీరి బాటలోనే నడవడానికి నైట్రో స్టార్ సుధీర్ బాబు (Sudheer Babu) సిద్ధమయ్యాడు.
నటుడిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ బాబు, త్వరలోనే దర్శకుడిగా మారి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఒక విభిన్నమైన కథాంశంపై పనిచేస్తున్న ఆయన, కథ మీద నమ్మకంతో వేరే దర్శకుడికి అప్పగించడం కంటే తన స్వయంగా మెగాఫోన్ పట్టి డైరెక్ట్ చేస్తేనే ఆ విజన్ పర్ఫెక్ట్‌గా వస్తుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇందులో ఆయనే స్వయంగా హీరోగా నటిస్తారని కూడా తెలుస్తోంది.
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే ఒక ప్రత్యేక అనౌన్స్‌మెంట్ పోస్టర్ లేదా ప్రెస్ మీట్ ద్వారా ఈ చిత్రాన్ని అధికారికంగా వెల్లడించేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోందని సమాచారం. హీరోగా సుధీర్ హిట్ కొట్టి చాలాకాలం అవుతుంది. విభిన్నమైన కథలను ఎంచుకున్నా ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. కానీ, ఈసారి తన కథను తానే సిద్దం చేసుకోవడంతో పాటు తానే సొంతంగా దర్శకత్వం వహిస్తోందడంతో హిట్ కొట్టే ఛాన్స్ ఎక్కువ ఉందని అంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముంది అని తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.